అటు తిరిగి ఇటు తిరిగి పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు వివాదం చంద్రబాబునాయుడు మెడకు చుట్టుకుంటోందా ? అంటే అవుననే అనిపిస్తోంది. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ట్రాక్ రికార్డు చూసిన వాళ్ళకు పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనే ఉంటారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమానాలు ఎందుకు పెరిగిపోతున్నాయంటే అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటశ్వేరరావు ఇజ్రాయెట్ నుండి అత్యాధునిక టెలికాం పరికరాలు కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ పరికరాలు కొనుగోలుకు ఏబీ రు. 25 కోట్లు చెల్లించారు.





తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా నాలుగేళ్ళ క్రితం తమను పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయమని ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ సంస్ధ సంప్రదించినట్లు చెప్పారు. ఆ సాఫ్ట్ వేర్ కొనుగోలుకు తాను అంగీకరించలేదన్నారు. అయితే ఆ సాఫ్ట్ వేర్ ను చంద్రబాబునాయుడు కొన్నట్లు మమత చెప్పారు. దాంతో ఇపుడా వివాదం ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. చంద్రబాబు హయాంలో పోలీసు శాఖకు సంబంధించి మొత్తం ఇంటెలిజెన్స్ చీఫే కనుసన్నల్లోనే నడిచిందన్న ఆరోపణలున్నాయి.





పైగా ఏబీ రు. 25 కోట్ల వ్యయంతో ఇజ్రెయల్ నుండే పరికరాలు కొనుగోలు చేయటం ఇక్కడ మమత ఆరోపణలకు మద్దతుగా నిలుస్తోంది. చంద్రబాబు హయాంలో తమ ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చాలాసార్లే ఆరోపించారు. ట్యాపింగ్ దెబ్బకు జగన్ కూడా హైదరాబాద్ నుండే వ్యవహరాలు నడిపేవారు. అయితే పెగాసస్ ఆరోపణలను టీడీపీ కొట్టేస్తోంది.





దీనికి వాళ్ళు చెబుతున్నదేమంటే పెగాసస్ ను కొనలేదని ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు డీజీపీ గౌతమ్ సవాంగ్ సమాధానమిచ్చారని చెబుతున్నారు. తమ వాదనకు మద్దతుగా సమాధాన లేఖను కూడా చూపిస్తున్నారు. అయితే తమ్ముళ్ళు మరచిపోతున్నదేమంటే సమాధానం ఇచ్చింది గౌతమ్ సవాంగ్ కాదు. డీపీజీ ఆఫీసులోని డిప్యుటి ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫీసు సమాధానం ఇచ్చింది.  పైగా గౌతమ్ సవాంగ్ డీపీజీ అయ్యింది 2019, జూన్లో అంటే జగన్ సీఎం అయినతర్వాతే.





చంద్రబాబు హయాంలో డీజీపీ ఆఫీసు ఏమికొన్నదనే విషయాన్ని తర్వాతెప్పుడో డీజీపీ అయిన సవాంగ్ ఎలా చెప్పగలరు ? పైగా ఇజ్రెయెల్ నుండి కొనుగోలు చేసింది ఇంటెలిజెన్స్ చీఫ్. అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ కార్యాలయం వేరు, డీజీపీ ఆఫీసు వేరు.  ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేసిన అత్యాధునిక పరికరాలు ఇంటెలిజెన్స్ చీఫ్ కొడుకు పేరుతో దిగుమతయ్యిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. కాబట్టి చంద్రబాబు హయాంలో పెగాసస్ కొనుగోలు చేయలేదని చెప్పేందుకు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: