గత కొన్ని రోజులుగా చైనా భారత్ సరిహద్దు వివాదం గురించి భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ వివాదం వల్ల ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చైనా భారత్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు రేపు ఇరు దేశాల లెఫ్టినెంట్ జనరళ్ల సమావేశం జరగనుంది. చైనా ఆర్మీ గాల్వన్ లోయ దగ్గర రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్లిందని... భారత ఆర్మీ ఒక కిలోమీటర్ వెనక్కు వెళ్లిందని సమాచారం అందుతోంది. 
 
అయితే సరిహద్దు వివాదం విషయంలో తమ వైఖరి మారదని భారత్ ఇప్పటికే చైనాకు తేల్చి చెప్పింది. రేపు జరగబోయే సమావేశానికి లడఖ్ వేదిక కానుంది. భారత్ డోక్లాం వివాదం సమయంలో అనుసరించిన వ్యూహాన్నే ప్రస్తుతం కూడా అనుసరించనుందని తెలుస్తోంది. భారత్ తరపున లెఫ్టినెంట్ జనరల్ హర్దీప్ సింగ్ ఈ భేటీకి హాజరు కానున్నారు. భారత్ తన వాదనను రేపు గట్టిగా వినిపించనుందని తెలుస్తోంది. 
 
అయితే చైనా భారత్ సరిహద్దు వివాదంలో పాక్ చైనాను రెచ్చగొడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ చైనాకు లడఖ్ మీద కలలు కనడం మానేయడంటూ సూచనలు చేసింది. చైనా భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలన్నింటిని ఆక్రమించుకోవాలని ఆశిస్తోంది. ఈ రాష్ట్రాలను చైనా ఆక్రమిస్తే దేశంపై చైనా ఆధిపత్యం చలాయించే అవకాశం ఉంది. రక్షణపరంగా ముఖ్యమైన ప్రాంతాలను హస్తగతం చేసుకోవాలని చైనా భావిస్తోంది. 
 
పాక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ భారత్ పై చైనాను ఉసిగొల్పుతోంది. భారత్ సరిహద్దు వివాదం విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చైనా వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాలని పాక్ భావిస్తోంది. తమకంటే బలమైన మిత్రదేశం చైనాను రెచ్చగొడుతోంది. ఇప్పటికే కింది స్థాయిలో జరిగిన చర్చలు విఫలం కావడంతో రేపు జరబోయే చర్చల్లో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది.                        

మరింత సమాచారం తెలుసుకోండి: