1993 ముంబై పేలుళ్ల నిందితుడు యాకూబ్ మెమన్ ను నాగ్ పూర్ జైలులో ఉరితీసిన విషయం తెలిసిందే.  ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడు యాకుబ్ మెమన్ ను ఈ ఉదయం నాగ్ పూర్ సెంట్రల్ జైల్ లో ఉరి తీసారు. తన ఉరిని నిలిపివేయాలని కోరుతూ మెమన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించడంతో అయనకు శిక్ష అనివార్యమయింది.

ఉదయం 6.30- 7 గంటల మధ్య ఉరిశిక్ష అమలు చేయాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు నాగ్ పూర్ జైలు అధికారులు యాకుబ్ కు ఉరి శిక్షను అమలు చేశారు.ఉదయం  7 గంటల ప్రాంతంలో ఆయన మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు.   ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో భద్రతను అధికారులు పటిష్టం చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్ట్లో భారీగా భద్రత పెంచారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని అధికారులు తెలియజేశారు. నగరంలో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది.

యాకుబ్ మెమన్ ఉరి


ఈ మేరకు హై అలర్ట్ ప్రకటించింది. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. ఎయిర్‌ పోర్ట్‌, రైల్వేస్టేషన్లలో హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రత్యేకమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇక ముంబైలో హైఅలర్ట్‌ను ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు సెలవు రద్దు చేసింది. దాదాపు 35 వేల మంది పోలీసులు నేడు బందోబస్తును పర్యవేక్షించనున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: