ఒకప్పుడు గోల్కొండ గా ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో కుతుబ్ షాహి రాజు హైదరాబాద్ నగరాన్ని నిర్మించడంతో ఈ నగర చరిత్ర ప్రారంభమైంది. భాగమతి పేరు మీద దీనికి భాగ్యనగరం అన్న పేరు కూడా వచ్చింది. ఇక బిజెపి వాళ్లు ఎప్పుడు ఏం దొరుకుతుందా ? అని ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు బీజేపీ నేతలు తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తామని సంచలన ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ పేరును భాగ్యనగరం గా పెడతామని చెబుతున్నారు.
తాజాగా భాగ్యనగర్ పేరుతో ఆర్ఎస్ఎస్ ప్రకటన చేయడంతో మరోసారి హైదరాబాద్ పేరు మార్పు అంశం వార్త ల్లోకి ఎక్కింది. అయితే ఈ ప్రకటన పట్ల పెద్ద ఎత్తున నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో ఆర్ఎస్ఎస్ మూడు రోజుల సమన్వయ సమావేశాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నే సామాజికంగా అనే క రంగాల్లో ప్రభావితం చేస్తోన్న ఆర్ ఎస్ ఎస్ స్ఫూర్తి తో వివిధ సంస్థల కార్యకర్తలతో సమన్వయ భైఠక్ 2022 జనవరి 5 నుంచి 7వ తేదీ వరకూ భాగ్యనగర్ లో జరుగనుందని ఆర్ ఎస్ ఎస్ ప్రకటన చేయడంతో దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి