
కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి వైసీపీ పార్టీకి కూటమికి కేవలం 15 నుంచి 20 శాతం మాత్రమే ఉన్నదంటూ గత ఎన్నికలలో కనిపించింది. అటు అధికారం రావాలి అన్న మార్చాలి అన్న కేవలం ఈ 15 నుంచి 20 శాతం మంది మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటారు. కానీ 2014 ఎన్నికలలో మాత్రం జగన్ ఓడిపోయింది కేవలం 2% మాత్రమే. అయితే 2019లో టిడిపిని ఓడించింది 20 శాతం ఓటు పర్సంటేజ్ తో. అయితే కూటమి ప్రభుత్వానికి పడిన 15 నుంచి 20% ఓట్లలో 10 శాతం మంది వైసీపీ సానుభూతిపరులు ఉన్నారట. మరి 10 శాతం మంది కొత్తగా సూపర్ సిక్స్ హామీలను చెప్పడంతో వెళ్లారని తెలుస్తోంది.
కానీ గత ప్రభుత్వం తీసుకు వచ్చిన పథకాలను అమలు చేయకపోవడంతో (రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, మహిళలకు 15వేల రూపాయలు, వాహన మిత్ర, వాలంటరీ వ్యవస్థ) ఇవే కాకుండా మరికొన్ని ఉన్నవి. ఎన్నికల ముందు ఇస్తానంటూ చెప్పిన చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిపోయి ఇప్పటికీ ఏడాది అవుతూ ఉన్న ఏమాత్రం అమలు చేయలేదు. అయితే ఇప్పుడిప్పుడే పథకాలను అమలు చేయడానికి సన్న హాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నుంచి మిగిలిన 10% ఓటర్లను చేజారనివ్వకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉన్నది. మరి 2029 ఎన్నికలలో ఎవరికి ఎంత శాతం బోర్డుతో గెలుస్తారో చూడాలి. ముఖ్యంగా మేనిఫెస్టో మీద ఆధారపడి ఉన్నది.