ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలకు ఇద్దరు మహిళల సైతం ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.. టిడిపి ,జనసేన ,వైసిపి పార్టీలు ఏపీలో హవా చూపిస్తూ ఉన్న.. ఇదే సమయంలో కాంగ్రెస్, బిజెపి రెండు జాతీయ పార్టీలకు కూడా మహిళ నేతల ప్రాతినిథ్యం వహిస్తూ దీటుగా ముందుకు వెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా వైఎస్ షర్మిల ఉండగా బిజెపి పార్టీ చీఫ్ గా పురందేశ్వరి ఉన్నది. అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆయా పార్టీల బాధ్యతలను తీసుకోవడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో భారీగా ఎఫెక్ట్ పడింది. ఒక్కసారిగా ఏపీలో జీరో పరిస్థితి మొదలయ్యింది. మళ్లీ పుంజుకోవాలని షర్మిలని తీసుకురావడం జరిగింది. గత ఎన్నికలలో 0.5% శాతం మాత్రం ఓటు పుంజుకునట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా నాయకుల మధ్య ఎలాంటి సఖ్యత కూడా కనిపించడం లేదు. షర్మిల మాత్రం బలమైన నాయకురాలిగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్న ఎదగలేకపోతోంది. నాయకులను దగ్గరికి చేర్చుకోవడంలో విఫలమయ్యిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఏడాదైనా తన సొంత అజెండాతో ప్రభుత్వాలను ప్రశ్నించి, సీనియర్ నేతలను దగ్గరకి తీసుకుంటుందేమో చూడాలి మరి.



ఆంధ్రప్రదేశ్లో బిజెపి పార్టీ విషయానికి వస్తే కూటమిలో బాగానే ప్రాధాన్యత కనిపిస్తోంది. బిజెపి పార్టీ చీఫ్గా ఉన్న పురందేశ్వరి రాజకీయాలకు కొత్తేమీ కాదు.. గతంలో కూడా ఇమే కేంద్రమంత్రిగా పని చేశారు.. బిజెపిలో ఆర్ఎస్ఎస్ నాయకులకు కూడా చాలామంది ఉన్నారు. అందుకే పురందేశ్వరి తనదైన శైలిలో ఎక్కడ ఎలా స్పందించాలి ఏ విషయాలను పరిగణంలోకి తీసుకోవాలని విషయంపై అడుగులు వేస్తూ ఉంటుంది. అలాగే కేంద్రంలోని పెద్దలతో కూడా ఎక్కువగా కలివిడిగానే కనిపిస్తూ ఉంటుంది పురందేశ్వరి. రాజకీయంగా పురందేశ్వరి గ్రాఫ్ పదిలంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి 2029 పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: