
అందులో భాగంగా స్వయంగా ప్రతి నెల కూడా పెన్షన్లు ఇచ్చేటప్పుడు చంద్రబాబు గారు కూడా వెళ్తున్నారు. అలా వెళ్ళినటువంటి సందర్భంలో ఏదైతే పెనుమాకలలో ఒక కుటుంబం దగ్గరకి వెళ్ళారు (పాములు నాయక్ అనే కుటుంబ) సభ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు.. వాళ్లు గుడిసెలో ఉండేవాళ్లు.. ఆ గుడిసెకు బదులుగా తమకు ఒక ఇల్లు కట్టించి ఇవ్వండి అంటూ చంద్రబాబుని అడగగా..11 నెలల తర్వాత ఇప్పుడు వాళ్లకి సొంత డాబా ఇల్లు కట్టించారు .ఇందులో 1,80,000 రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటే మిగతా డబ్బులు లోకేష్ తో పాటుగా మిగిలిన టిడిపికి సంబంధించి నేతలు డబ్బులు పెట్టి కట్టించి ఇచ్చారు. అయితే నిన్నటి రోజున వారు గృహప్రవేశం చేశారు ఈ విషయాన్ని టిడిపి అనుకూల మీడియా హైలెట్ చేసింది.
ఈ విషయం అంతా బాగానే ఉన్నా.. 11 నెలల్లో ఒక ఇల్లు కట్టించారు అది కూడా వ్యక్తిగతంగా అతనికి .. అదే గత ప్రభుత్వంలో 20 లక్షల ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటివి చాలానే ఉన్నాయి. మొత్తం జగన్ 30 లక్షల ఇళ్లకు ఓకే చేశారు.. అందులో 10 లక్షల ఇల్లు పూర్తి అయ్యాయని అధికారికంగా ప్రకటన ఉంది.. మరి ఒకవేళ మిగిలిన 20 లక్షల ఇల్లు కట్టించి ఉంటే.. వారందరూ కూడా గృహప్రవేశం చేస్తారు. జగన్ మీకు స్థలం ఇచ్చి వదిలేశారు మా హయాంలోని మీరు ఇల్లు కట్టుకొని ఉన్నారని విషయాన్ని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు కూతమి ప్రభుత్వం. టిట్కో ఇల్లు కూడా పూర్తి కాలేదు.. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఉన్న సమయంలో వారి దగ్గర మూడున్నర లక్షల రూపాయలు తీసుకున్నారు.. వాటిని కూడా పూర్తి చేయలేదు.. ఇప్పుడు ఈ ఇల్లులు కూడా అలాగే ఉండిపోయాయి. సొంత ఇల్లు అనేది ఒక వ్యక్తికి ఇప్పించారంటే దేవుడుగా భావిస్తారు. మరి ఇలాంటి విషయాలను సీఎం చంద్రబాబు ఆలోచిస్తారా లేదా చూడాలి.