
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ చేస్తున్న అప్పులు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అనుకూల పత్రికలు జగన్ చేస్తున్న అప్పుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించేవి. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండటంతో సాక్షి దినపత్రిక ఆ బాధ్యతను తీసుకుంది.
కూటమి సర్కార్ ఇప్పటికే 1,70,000 కోట్ల రూపాయల అప్పు చేసిందని తెలుస్తోంది. కేవలం 12 నెలల కాలంలోనే ఇంత భారీ స్థాయిలో అప్పులు చేయడం ద్వారా కూటమి సర్కార్ రికార్డ్ క్రియేట్ చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సర్కార్ ఈ స్థాయిలో అప్పులు చేసినా సూపర్ సిక్స్ అమలులో మాత్రం ఫెయిల్ అవుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సంపద సృష్టించి పథకాలను అమలు చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే వాస్తవంగా మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎన్నికల ముందు గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు ప్రస్తుతం రుణాలు తీసుకునిరావడమే లక్ష్యంగా పెట్టుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రజలపై ఊహించని స్థాయిలో ఆర్థిక భారం పడుతుండటం గురించి కూడా సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. మంగళవారం రోజున చంద్రబాబు మరో 2,000 కోట్ల రూపాయల అప్పు చేసినట్టు సమాచారం.
చంద్రబాబు ఈ స్థాయిలో అప్పులు చేస్తున్నా గతంలో విమర్శలు చేసిన వాళ్ళెవరూ ఇప్పుడు స్పందించకపోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ విమర్శల గురించి చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. చంద్రబాబు భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో తెలియాల్సి ఉంది. అన్నదాత సుఖీభవ స్కీమ్ అమలు మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ అయితే ఉంది. అప్పులను వీలైనంత తగ్గిస్తూ బాబు సర్కార్ పాలన సాగిస్తే బాగుంటుందని సామాన్యులు సైతం అభిప్రాయపడుతున్నారు.