జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో సంచలన ఫలితాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో సక్సెస్ సాధించింది. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పాపులారిటీ అంతకంతకు పెరుగుతోంది. అయితే పవన్ భవిష్యత్తు కార్యాచరణ విషయంలో అభిమానుల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. పవన్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ వేగంగా పూర్తయినా ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.  త్వరలో పూర్తిస్థాయి రాజకీయాల్లో  బిజీ అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది.  2027 వరకు ఫుల్ టైం రాజకీయాలతో బిజీ కానున్నారని తెలుస్తోంది.  పవన్ మరో సినిమాలో నటిస్తారని   ప్రచారం జరుగుతున్నా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

మరో 50 నియోజకవర్గాల్లో  జనసేనను బలోపేతం చేసే దిశగా పవన్ అడుగులు పడనున్నాయని సమాచారం అందుతోంది.  2029 ఎన్నికల్లో  జనసేన ప్రణాళికలు ఏ  విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.  వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలపై  పవన్ కళ్యాణ్ ఫోకస్  పెట్టనున్నారని వార్తల్లో సమాచారం అందుతోంది.  నామినేటెడ్ పదవుల్లో  జనసేనకు ఒకింత అన్యాయం జరిగిందని  కామెంట్లు వినిపిస్తున్నాయి.

బీజేపీకి జరుగుతున్న  స్థాయిలో  న్యాయం కూడా జనసేనకు  జరగలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.  తెలుగుదేశంపై ఒత్తిడి  తెచ్చే దిశగా జనసేన అడుగులు పడనున్నాయని  సమాచారం అందుతోంది.  పవన్ ను  కూల్ చేసే దిశగా టీడీపీ కీలక నేతలు అడుగులు వేస్తారేమో  చూడాల్సి ఉంది.  పవన్ భవిష్యత్తు  ప్రణాళికలు టీడీపీకి అనుకూలంగా ఉంటాయో  వ్యతిరేకంగా ఉంటాయో చూడాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: