తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమకు రాజకీయ ప్రాధాన్యాను గుర్తించి అడుగులు వేగంగా మరింత పెంచుతున్నారన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. అందులో భాగంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని ఈనెల 10వ తారీఖున అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాస్తవానికి, మొదట ఈ కార్యక్రమాన్ని ఉభయ గోదావరి జిల్లాల్లో జరిపే అవకాశం ఉందని చర్చలు జరిగాయి. అయితే, చంద్రబాబు, రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, అక్కడే నిర్వహించేందుకు నిర్ణయించారని సమాచారం అందింది.


ఇది అనూహ్యమే, కానీ రాయలసీమను లక్ష్యంగా చేసుకొని కార్యక్రమాలను నిర్వహించడం టిడిపి వ్యూహాత్మక అడుగు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది మేలో జరిగిన మహానాడు కూడా రాయలసీమలోనే ఘనంగా జరిగింది. ఆ తర్వాత, కడప, ఒంటిమిట్ట, పులివెందులలో జడ్పీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూడా టిడిపి హవా కొనసాగింది. ఈ నేపథ్యంలో రాయలసీమలో పార్టీ హవాని పునరుద్దరించడానికి, స్థానిక ప్రజలకి చేరుకునే దిశలో చంద్రబాబు చర్యలు తీస్తున్నారనే స్పష్ట సంకేతం కనిపిస్తుంది.



ఇప్పుడు, సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయడం ద్వారా, టిడిపి పార్టీని బలోపేతం చేయడం, రాయలసీమలో రాజకీయ దూకుడు పెంచడం అనే లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా రాయలసీమను వేదికగా చేసుకొని మరిన్ని రాజకీయ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం.ఇది మాత్రమే కాదు, ప్రభుత్వ కార్యక్రమాలు కూడా రాయలసీమలో ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నాయి. ఇటీవల కృష్ణా నదీ నీటిని అందించడం, విండ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు స్థానిక అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్న అంశం ఏమిటంటే, వీటిద్వారా రాయలసీమలో బలమైన వైసీపీ ఓటు బ్యాంకును టిడిపి సవాలు చేయడానికి వ్యూహం రూపొందిస్తున్నారా అనే చర్చ జరుగుతోంది.



రాయలసీమ ప్రాంతీయంగా టిడిపి కి ప్రబల ఓటు బ్యాంకుగా ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో మరింత బలోపేతం చేభవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం చంద్రబాబు వ్యూహం. ఇప్పటి వరకు వైసీపీకి ప్రత్యామ్నాయ ప్రతికూలత కనిపించకపోయినా, భవిష్యత్తులో టిడిపి పొజిటివ్ అడుగులు వేసినప్పుడు, రాజకీయ పరిణామాలు వైసీపీకు సవాలుగా మారే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విధంగా రాయలసీమను టిడిపి క్లీన్హిట్ ప్రాంతంగా మార్చడం, పార్టీకి వ్యూహాత్మక, రాజకీయ బలం కల్పించడం కోసం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు స్పష్టంగా సంకేతాలు ఇస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: