ప్రస్తుతం క్రీడా ప్రపంచం మొత్తం ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ మాయలో మునిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి మ్యాచ్ చూస్తూ ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు క్రీడా అభిమానులు. ప్రేక్షకుల ఊహకందని రీతిలో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అని చెప్పాలి. ఇక ఎంతోమంది అభిమానులు ప్రపంచ  నలుమూలల నుంచి కూడా ఖతార్ చేరుకుంటూ తమ అభిమాన ఆటగాళ్లకు మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పాలి.


 సాధారణంగా ఇలా ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో ఇక ఆయా జట్ల ఆటగాళ్లకు సంబంధించిన జెర్సీలను లేదా ఆయా దేశపు జెండాలను పట్టుకుని తమ అభిమాన జట్టుకు మద్దతు ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటారు అభిమానులు.  కానీ ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ లో మాత్రం ఒక భిన్నమైన దృశ్యం కనిపించింది అని చెప్పాలి. బ్రెజిల్ సెర్బియా మధ్య జరిగిన మ్యాచ్లో ఏకంగా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్స్ కు సంబంధించిన జెర్సీలు కాదు ఏకంగా భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి సంబంధించిన ఎల్లో జెర్సీని పట్టుకుని కనిపించారు అభిమానులు. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఖాతార్ జరుగుతున్న ఫుట్బాల్ మ్యాచ్లను చూడడానికి ఎంతో మంది భారత అభిమానులు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఇందులో ధోని అభిమానులు కూడా ఉన్నారు అని చెప్పాలి. అయితే ధోని ధరించే సీఎస్కే జెర్సీని పట్టుకుని ఇక స్టేడియంలో సందడి చేశారు ధోని అభిమానులు. ఇక ఇందులో ఒక కామన్ పాయింట్ కూడా ఉంది. బ్రెజిల్ జట్టు ఆటగాళ్ల జెర్సీతో పాటు సీఎస్కే  జెర్సీ కూడా పసుపు రంగులో ఉండటం గమనార్హం. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కడికి వెళ్లినా ధోని అక్కడ ఉంటాడు అంటూ కామెంట్ చేసింది. ఇందుకు సంబంధించిన ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: