ప్రస్తుతం భారత్ న్యూజిలాండ్ మధ్య ఇండియా వేదికగా టి20 సిరీస్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరిగాయి. మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధిస్తే రెండవ మ్యాచ్లో టీమ్ ఇండియా విజయకేతనం ఎగరవేసింది అని చెప్పాలి. అయితే ఇక రెండో టి20 మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది. మ్యాచ్ మొత్తంలో ఒక్క సిక్సర్ కూడా నమోదు కాలేదు అని చెప్పాలి. అంతేకాదు సాధారణంగా స్పిన్నర్లు చాలా తక్కువగా బౌలింగ్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ మ్యాచ్ లో మాత్రం ఫాస్ట్ బౌలర్ల కంటే స్పిన్నర్ లు ఎక్కువ బౌలింగ్ చేస్తూ హవా నడిపించారు.


 ఇరు జట్లలో కూడా ఏకంగా నలుగురు స్పిన్నర్లు బౌలింగ్ చేశారు అని చెప్పాలి.  భారత్ 13 ఓవర్లకు స్పిన్ బౌలర్ లను ఉపయోగిస్తే న్యూజిలాండ్ 17 ఓవర్లు స్పిన్నర్లతోనే పూర్తి చేసింది. అంతలా పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా మారింది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగం పరుగులు చేయడానికి నానా కష్టాలు పడ్డారు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా స్పిన్నర్, రిస్ట్ మెజీషియన్ గా పేరు సంపాదించుకున్న కుల్దీప్ యాదవ్ వేసిన ఒక బంతి మాత్రం మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది అని చెప్పాలి.


 ఇకపోతే ఈ బంతికి సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్  వేదికగా వైరల్ గా మారిపోవడంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఆ బంతిని బాల్ ఆఫ్ ది ఇయర్గా కీర్తిస్తూ ఉండడం గమనార్హం. కుల్దీప్  యాదవ్ వేసిన పదవ ఓవర్లో 4, 5వ బంతులు డారిల్ మిచెల్ పరుగులు చేయలేకపోయాడు. అయితే మిచెల్ ఒత్తిడిలో ఉన్నాడని గమనించిన కుల్దీప్ అదే అదునుగా భావించి అద్భుతమైన బంతిని సంధించాడు. అప్పటికే రెండు డాట్ బాల్స్ ఆడిన మిచెల్ కుల్దీప్ వేసిన బంతితో దిమ్మతిరిగిపోయింది. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లో పడిన బంతి భారీ టర్న్ తీసుకుని వికెట్లను గిరాటేసింది. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: