స్త్రీలో అండం విడుదల అయిన రోజు నుంచి శరీర ఉష్ణోగ్రత అరడిగ్రీ నుండి ఒక డిగ్రీ ఫారన్ హీట్ వరకు పెరుగుతుంది. తిరిగి బహిష్టు ముందుగా శరీర ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గుతుంది. ఈ విదంగా అండం విడుదల అని తెసుకునే దానిని బేసిన్ బాడీ టెంపరేచరు పద్దతి అంటారు అండం తయారీ లేనివాళ్ళలో ఈ విధంగా శరీర ఉష్ణోగ్రత మార్పు ఉండదు.
ఒక్కొక్కసారి శరీర ఉష్ణోగ్రత పట్టిక ద్వారా అండం విడుదల అవుతుంది. లేనిది తెలసుకోవడం కుదరదు. అటువంటప్పుడు బహిస్టు అవటానికి ఒకటి రెండు రోజుల ముందు గర్భాశయం నుంచి (ఎన్ డో మిట్రియల్ ఎపొనల్) చిన్న ముక్కతీసి మైక్రోస్కోపుతో పరీక్ష చేయడం జరుగుతుంది. అండం విడుదలయి ప్రొజస్టిరోన్ హార్మోను తయారవుతూ వుంటే గర్భాశయంలోని పొరమీద మార్పులు వస్తాయి.
అందువల్ల ఆ చిన్న ముక్క పరీక్ష ద్వారా అండం విడుదలయినదీ లేనిది తెలుసుకోవచ్చు. అదేవిదంగా యోని మార్గంలోని కణాలమీద అండం విడుదలయిన తరువాత కొన్ని మార్పులు కనబడతాయి. అండం విడుదల కాకపోతే ఆ మార్పులు కనబడువు. అందుకని బహిస్టుకి ఒకటి రెండు రోజులు ముందుగా యోని మార్గం నుంచి కూడా ఒక చిన్న పొరని తీసుకుని పరీక్ష చేస్తే అండం విడుదలని నిర్ణయించుకోవచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: