తమిళనాడులో రాజకీయ యుద్ధం క్రమంగా తారా స్థాయికి చేరుకుంటుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. ఇక ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష అన్నాడిఎంకె వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తక్కువ అంచనా వేసిన వారికి బలంగా, రీసౌండ్ వచ్చే రేంజ్ లో ఆన్సర్ ఇస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ ర్యాలీలకు వస్తున్న స్పందన ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. సాధారణంగా అన్నాడిఎంకె అనగానే జయలలిత మాట వినపడుతోంది.


ఆమె తర్వాత ఆ పార్టీకి ప్రజాదరణ ఉండదు అంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో పార్టీలో అంతర్గత విభేదాలు కూడా ఇబ్బంది పెట్టాయి. సరైన నాయకత్వం కోసం పార్టీ క్యాడర్ కూడా ఎదురు చూసింది. మాజీ సిఎం పళని స్వామికి ప్రజాదరణ ఉండదు అనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. కానీ.. పళని స్వామి ర్యాలీలకు ఊహించని స్పందన వస్తోంది. అమ్మ ఆశీర్వాదం మాజీ సిఎం పళని స్వామికి ఉందంటూ తమిళనాట రుజువు అయింది. జయలలితకే కాదు.. ఆమె నిర్మించి, దర్శకత్వం వహించి, ప్రజల్లో నిలబెట్టిన పార్టీ.. పునాదులు ఎంత బలంగా ఉన్నాయో రుజువు అవుతోంది.


రెండు రోజుల క్రితం పాలకోడ్ లో నిర్వహించిన ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. లక్షలాది మంది జనం అన్నాడిఎంకె ర్యాలీకి హాజరు అయ్యారు. తమ అభిమాన పార్టీకి, నాయకులకు బ్రహ్మరధం పట్టారు. పార్టీపై తమకు ఉన్న నమ్మకాన్ని అత్యంత బలంగా చాటారు. ముఖ్యంగా ఈ ర్యాలీలకు యువత, మహిళలు, రైతులు భారీగా తరలి వస్తున్నారు. ఇది పార్టీకి మరింత బలం చేకూరుస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తన వైపుకు తిప్పుకునే విషయంలో.. అన్నాడిఎంకే సక్సెస్ అవుతోంది. అటు స్థానిక నాయకత్వం కూడా ప్రజల్లో ఉండటం ఆ పార్టీకి మరింత బలం చేకూరుస్తోంది. నాయకత్వం విషయంలో స్పష్టత రావడంలో క్యాడర్ విభేదాలు పక్కన పెట్టి.. జెండాను రెపరెపలాడిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: