ఐపీఎల్ 2025 చివరి దశకు చేరుకుంది.ఈ రోజున ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోతోంది. అయితే మొదటిసారి ఎవరు కప్  కొడతారు అనే విషయం పైన అటు అభిమానులతో పాటు చాలామంది క్రికెట్ ప్రియులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఐపీఎల్ లో గెలిచిన తర్వాత ఎవరెవరికి ఎంత ప్రైజ్ మనీ లభిస్తుందనే విషయం అభిమానులను ఆత్రుత పరిచేలా చేస్తోంది వాటి గురించి చూద్దాం.


ఫైనల్ ఈసారి ఏ జట్టు గెలిచిన రూ .20 కోట్ల వరకు ప్రైజ్ మనీ లభిస్తుంది. ఇక రన్నర్ కి రూ.13 కోట్ల రూపాయలు లభిస్తుందట. ఐపీఎల్ లో ప్రతి ఏటా కూడా ప్రైజ్ మనీ పెరుగుతూనే ఉందని తెలుస్తోంది.. 2024 సీజన్లో మొత్తం 46.5 కోట్ల రూపాయలు నిర్ణయించారు. ఇందులో 20 కోట్ల రూపాయలు విన్నర్ కి 13 కోట్ల రూపాయలు రన్నర్ కి ఇవ్వగా మూడవ స్థానంలో నిలిచిన జట్టుకు ఏడు కోట్లు నాలుగవ స్థానంలో నిలిచిన జట్టుకి 6.5 కోట్ల రూపాయలు ఇచ్చారు.


ఆరంజ్ క్యాప్ - 10 లక్షలు
పర్పుల్ క్యాప్ -10 లక్షలు
ఎమర్జెన్సీ ప్లేయర్ ఆఫ్ ది సీజన్-20 లక్షలు
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ - 10 లక్షలు
ఒక్క సీజన్లో అత్యధిక శిక్షలు కొట్టిన వారికి -10 లక్షలు
సీజన్లో అత్యధిక విలువైన ఆటగాడు-10 లక్షలు.
ప్లేయర్ ఆఫ్ ది సీజన్ -10 లక్షలు
గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ -10 లక్షలు

2008-2009 గెలిచిన టీమ్ కి రూ .4.8 కోట్ల రూపాయలు. రన్నర్ కి రూ .2.4 కోట్ల రూపాయలు ఇచ్చే వారు. అయితే 2025 కి వచ్చేసరికి విజేతకు 20 కోట్లు రన్నర్ కి  రూ.13 కోట్లు బహుమతిగా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: