తాజాగా ముగిసిన ఐపీఎల్ 2025 ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన ఆర్సీబీ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో రెండు ఫైనల్స్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. ఇది వరకు 2017లో, ముంబై ఇండియన్స్ తరఫున రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ పై జరిగిన ఫైనల్‌ లో 47 పరుగులు చేసి విజయంలో కీలకంగా నిలిచారు. ఆ మ్యాచ్‌లో ఆయన అందించిన విలువైన ఇన్నింగ్స్‌ కు ఫలితంగా “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డు దక్కింది.

మళ్ళీ ఇప్పుడు 2025లో, ఇప్పుడు ఆర్సీబీ తరఫున పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్‌లో బౌలింగ్‌లో మెరుపులు మెరిపించారు. 4 ఓవర్లు వేసి కేవలం 17 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీసిన కృనాల్ పాండ్యా, పంజాబ్ రన్స్ చేసే వేగాన్ని దెబ్బతీశారు. ఈ అద్భుత ప్రదర్శనకు మరోసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో సత్కరింపబడ్డారు. ఈ రెండు విభిన్న ప్రదర్శనలు ఒకటి బ్యాటింగ్‌లో, మరొకటి బౌలింగ్‌లో ఐపీఎల్ ఫైనల్స్‌లో విశేషంగా నిలవడం అనేది కృనాల్ పాండ్యా ఆల్‌రౌండ్ నైపుణ్యానికి నిదర్శనం. ఒకే ఆటగాడిగా రెండు ఫైనల్స్‌లో ఈ అవార్డు అందుకోవడం ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి జరగడం గమనార్హం.

ఈ ఘనతతో కృనాల్ పేరు IPL చరిత్రలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు అభిమానులు ఆయనను కేవలం హార్దిక్ అన్నయ్యగా కాకుండా, ఐపీఎల్ లెజెండ్‌గా గుర్తించేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి 18 ఎల్లా ఆర్సీబి కళను నెరవేరుస్తూ కృనాల్ పాండ్యా విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.మరోవైపు 18 ఏళ్ల  కళను పంజాబ్ ఈసారి కూడా అందుకోలేక నిరాశలో ఉండిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: