సాధారణంగా అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు ఎప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంటాయ్ అన్న విషయం తెలిసిందే. ఇలా అడవుల్లో ఉండే జంతువులకు సంబంధించిన జీవనశైలని తెలుసుకోవడానికి నేటిజన్స్ అందరు కూడా ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ల లాగా అందరికీ సఫారీల్లోకి వెళ్లి ఇక క్రూర మృగాలను దగ్గర నుంచి ఫోటోలు తీసే అవకాశం రాదు. కాబట్టి ఇక ఇలా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఫోటోలను చూసి ఇక ఆ ఫీల్ ని ఆస్వాదిస్తూ ఉంటారు నేటిజన్స్.  అంతేకాదు ఇక సింహాలు పులులు లాంటి క్రూర మృగాలు ఎలా వేటను కొనసాగిస్తాయి అన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో తెలుసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి తరహా వీడియోలు వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. అయితే సాధారణంగా సింహం తర్వాత ఆ స్థాయి బలం కలిగి ఉండేది పులి అని చెబుతూ ఉంటారు. ఒక్కసారి పులి పంజా విసిరింది అంటే చాలు ఎలాంటి జంతువు అయినా సరే దానికి ఆహారంగా మారిపోవాల్సిందే. అందుకే ఒకవేళ జంతు ప్రదర్శనశాలలో ఉన్న కూడా పులిని ప్రత్యేకమైన బోన్ లో పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే పులి బోనులో పులితో పాటు ఒక సాధు జంతువు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది. ఆ సాధు జంతువు ప్రాణం పోయినట్లే.


 కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. ఏకంగా ఒక భారీ ఆకారం కలిగిన పులి ఒక వీధి కుక్క ఒకే బోన్ లో ఉండడం గమనార్హం. అంతేకాదు ఈ రెండు కూడా ఫ్రెండ్స్ అన్నట్లుగానే ఒకే చోట నిలబడి బోన్ నుంచి బయటకు చూస్తూ ఉన్నాయి. అయితే బోన్ బయట ఉన్న ఒక సింహం పిల్లను చూస్తూ కుక్క దానితో ఆడుకోవాలని అరుస్తూ ఉండడం గమనార్హం. ఇది చూసి నేటిజన్స్ అందరు షాక్ అవుతున్నారు. పులి, కుక్క మద్య అసలు స్నేహం ఎలా కుదిరిందా తెలియక కన్ఫ్యూషన్లో పడిపోతున్నారు అందరూ.

మరింత సమాచారం తెలుసుకోండి: