చాలామంది ఆడవాళ్లు ఎదుర్కునే ప్రధాన సమస్య శరీరం నుంచి దుర్వాసన రావడం.కొంతమంది మహిళల్లో చెమటపట్టడం వల్ల శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇలా దుర్వాసన రావడం వల్ల వాళ్ళు సరిగ్గా నలుగురితో కలిసి ఉండలేరు.అసలు దీనికి కారణం ఏంటంటే ఉష్ణోగ్రత, గాలిలో తేమను బట్టి చెమట తీవ్రత ఆధారపడి వుంటుంది.మాములుగా స్వేదగ్రందులు శరీరమంతా ఉన్నప్పటికీ తల, చంకలు, ముఖ చర్మంలో ఎక్కువగా ఉన్నందునే ఆయా భాగాలలో చెమట ఎక్కువగా పడుతుంటుంది. ఈ చెమటతో బాటు శరీరంలోని ప్రొటీన్లు, కొవ్వు, ఆమ్ల లవణాలు, అమ్మోనియా వంటివి కూడా బయటకి పోతాయి. అందుకని చంకల్లో దుర్వాసన వస్తూ ఉంటుంది. ఆహారంలో తగిన మార్పులు చేసుకోవటం ద్వారా ఈ సమస్యను సమర్ధవంతంగా అధిగమించవచ్చు.




మరీ ముఖ్యంగా కాఫీ తాగడం అలాగే శీతల పానీయాలు, బ్లాక్ టీ, చాక్లెట్, వెల్లుల్లి, నీరుల్లి, చేపలు, రొయ్యల వంటి సీఫుడ్ మూలంగా చెమట పట్టే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాటికి దూరంగా ఉండాలి. తగినన్ని మంచినీళ్ళు తాగటం వల్ల శరీరంలోని నీటి నిల్వలు సమానంగా ఉంటాయి.ఫలితంగా శరీరం చల్లగా ఉండి చెమట పట్టటం కూడా తగ్గుతుంది. రోజువారీ ఆహారంలో బ్రెడ్ , గుడ్లు, చేపలు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. క్యాల్షియం శరీర ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉండేలా చేసి, చెమటను తగ్గిస్తుంది. క్యాల్షియం పెరుగులో పుష్కలంగా లభిస్తుంది. పెరుగు ఇష్టపడని వారు ఇతర పాల పదార్ధాలు, బాదం గింజలు, చిక్కుళ్ళు వంటివి తీసుకోవచ్చు. ఆహారంలో తగినంత పీచు ఉంటే జీర్ణప్రక్రియ సులువుగా జరిగి చెమట పట్టటం తగ్గుతుంది.




అందుకే రోజూ పీచు అధికంగా ఉండే గోధుమలు, ఓట్స్, పండ్లు తీసుకోవాలి. చెమట నివారణకు పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది.  పచ్చికూరగాయలు రోజూ తింటే శరీర దుర్వాసన సమస్య ఉండదు. తులసి, కొత్తిమీర తరుగును ఆహారంలో చేర్చినా శరీర దుర్వాసన అనేది తగ్గుతుంది.  మహిళలు టీ, కాఫీకు బదులుగా హెర్బల్ టీ తాగితే శరీర దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్టీరియా తొలగిపోతుంది. రోజూ కరివేపాకు తినడం వల్ల చెమట, దుర్వాసన బెడద అసలేమాత్రం వుండవు. బాదంపప్పు చెమట సమస్యను అదుపులోకి తెస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: