రాపిడో బుక్ చేసిన వినియోగదారులకు సంస్థ బ్యాక్ షీల్డ్ ను డిజైన్ చేసింది. దీంతో రైడ్ కెప్టెన్లకు, వారి ప్రయాణికులకు వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. షీల్డ్ ను అదనంగా చేర్చడంతో బైక్ ట్యాక్సీ సేవలను వినియోగించుకునే ప్రయాణికుల భద్రత పెంచే లక్ష్యంలో భాగమని కంపెనీ పేర్కొంది. ఈ షీల్డ్ తేలికపాటి పీవీసీ బోర్డుతో తయారు చేయబడిందని చెప్పారు. కెప్టెన్ ధరించేందుకు వీలుగా బ్యాక్ ప్యాక్ స్టైల్ స్ట్రాప్ లను కలిగి ఉంటుంది. దీంతో వైరస్ తో జాగ్రత్తగా ఉండవచ్చు.
బ్యాక్ షీల్డ్ బరువు సుమారు 400 గ్రాములు ఉంటుందని, డ్యూటీ సమయంలో కెప్టెన్ తప్పనిసరిగా షీల్డ్ ను ధరించాలని కంపెనీ ఆదేశించింది. ఆన్ డ్యూటీలో చేరినప్పటి నుంచి జాబ్ టైమింగ్స్ పూర్తి అయిన తర్వాతే షీల్డ్ ను తొలగించాలన్నారు. ఇలా చేయడం ద్వారా ఇద్దరి మధ్య దూరంతో పాటు రక్షణ ఏర్పడుతుందన్నారు.
ఈ రాపిడో బ్యాక్ షీల్డ్ లను బెంగళూరుకు చెందిన బైక్ టాక్సీ అగ్రిగేటర్ అందిస్తోందని సంస్థ ప్రకటించింది. దీంతో రాపిడో సేవలు మరింత పెరిగే అవకాశం ఉందని, కరోనా కష్టకాలంలో కెప్టెన్లు ఆర్థికంగా సహాయపడుతుందన్నారు. రక్షణ కవచాల కోసం రైడ్ కెప్టెన్లు పెట్టే ఖర్చుకి ఈ షీల్డ్ లు చేయూతగా నిలుస్తాయని రాపిడో సహ వ్యవస్థాపకుడు అరవిండ్ శంకా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కస్టమర్ల ఆరోగ్యం మాకు ఎంతో ప్రాధాన్యం అని వెల్లడించారు. కెప్టెన్లు తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు ధరించాలని సూచించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి