లాక్ డౌన్ కంటే ముందుగా గత సంవత్సరం నవంబర్ నుంచి తన బైక్ లకు సంబంధించి డెలివరీ లను చేపట్టింది ఆ సంస్థ. అయితే తన ప్రత్యర్థుల కంపెనీల కంటే అతి తక్కువ రేటుకు బైకులను అందజేస్తుంది ఈ కంపెనీ. అయితే కరోనా నేపథ్యంలో భాగంగా కంపెనీకి సంబంధించి బుకింగ్ ను నిలిపి వేయడం జరిగింది. ఇక అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత తన బుకింగ్స్ ని మొదలు పెట్టింది సంస్థ. ఇక ఏప్రిల్ నుండి భారత్ లో మొదలైన బిఎస్ 6 నేపథ్యంలో ఈ కంపెనీ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వాహనాలను రిలీజ్ చేయబోతోంది. ఇందుకోసం సంస్థ వెబ్ సైట్ లో కొత్త బైక్ల టెస్ట్ రైడ్ కోసం రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది కూడా.
ఇక తాజాగా సిఎఫ్‌మోటో 300 ఎన్‌కె, 650 ఎన్‌కె, 650 ఎమ్‌టి, 650 జిటి బైకులను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. వీటన్నిటికీ కూడా కాలుష్యాన్ని నిబంధలను అనుసరించి బిఎస్ 6 కు అప్ గ్రేడ్ చేసిందని తెలియజేశారు. ఇక సిఎఫ్‌మోటో 300 ఎన్‌కె ఈ బైక్ విషయానికి వస్తే... 292.4 సిసి లిక్విడ్ కూల్డ్, డిఓహెచ్‌సి సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చారు. ఇక ఇందులోని ఇంజన్ ను 33 bhp పవర్, 25 nm టార్క్ ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్ బాక్స్ తో పని చేస్తుంది. సిఎఫ్‌మోటో 650 ఎన్‌కె, 650 ఎమ్‌టి బైక్ లలో 659 cc ఇంజన్ ను అమర్చింది సంస్థ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి