ఇంకా రిలీజ్ కు ముందే అత్యధిక సంఖ్యలో బుకింగ్స్ పొందుతున్న 'మారుతి సుజుకి గ్రాండ్ విటారా' ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్న కస్టమర్ల కోసం కోసం కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది.ఇందులో భాగంగానే కంపెనీ ఈ కొత్త SUV ని ఎప్పుడు విడుదల చేస్తుంది అనే విషయం వెల్లడించింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, మారుతి గ్రాండ్ విటారా ఈ నెల 26 (సెప్టెంబర్ 26) న అధికారికంగా విడుదల కానుంది. ఈ కొత్త SUV అద్భుతమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. ఇది అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది.కంపెనీ ఈ SUV కోసం ఇప్పటికీ బుకింగ్స్ స్వీకరించించడం ప్రారంభించింది. ఇప్పటికే ఈ SUV కోసం కంపెనీ 53,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. ఇందులో కూడా దాదాపు 23,000 యూనిట్ల బుకింగ్స్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్స్ కి వచ్చినట్లు తెలుస్తుంది. దీన్నిబట్టి చూస్తే స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్స్ కి ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది.గ్రాండ్ విటారా కొత్త డిజైన్ పొందుతుంది, ఇందులో ఇప్పుడు కొత్త గ్రిల్ చూడవచ్చు. గ్రిల్ మధ్య భాగంలో పెద్ద సుజుకి బ్యాడ్జ్‌ ఉంది. దీనికి సమీపంలోనే 3-ఎలిమెంట్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ ఉన్నాయి, అదే సమయంలో రెండు వైపులా ఇంటిగ్రేటెడ్ టర్న్ లైట్లు ఇంకా 3-ఎలిమెంట్ ఎల్ఈడీ టెయిల్ లైట్ వంటివి ఉన్నాయి.


సైడ్ ప్రొఫైల్ లో 17-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, వెనుకవైపు ఎల్ఈడీ టెయిల్ లైట్ ఇంకా బ్రాండ్  లోగో ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కొత్త ఎస్‌యూవీ మరింత ఆధునికంగా కనిపించేలా చేస్తాయి.ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ అందుబాటులో ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఇంకా యాపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేస్తుంది. డ్యాష్‌బోర్డ్, డోర్లు ఇంకా సీట్లు అన్ని కూడా లెదర్ అపోల్స్ట్రే తో ఉన్నాయి. అంతే కాకుండా కలర్డ్ హెడ్స్ అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ప్రీమియం సౌండ్ సిస్టమ్, వాయిస్ అసిస్ట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ ఇంకా 40 కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఇంకా సుజుకి కనెక్ట్ యాప్ వంటివి అందుబాటులో ఉన్నాయి.త్వరలో విడుదల కానున్న మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌తో కూడిన రియర్ డిస్క్ బ్రేక్, హిల్ డిసెంట్ కంట్రోల్ ఇంకా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ వంటివి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: