ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫేమస్ జపనీస్ టూవీలర్ బ్రాండ్ 'కవాసకి ఇండియా'  ఇండియన్ మార్కెట్లో ఓ కొత్త బైక్ ని లాంచ్ చేసింది.కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ పేరు 'కవాసకి డబ్ల్యు175'. ఈ లేటెస్ట్ బైక్ ధర రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).'కవాసకి డబ్ల్యు175' రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి స్టాండర్డ్ ఇంకా స్పెషల్ ఎడిషన్. వీటి ధరలు వరుసగా రూ. 1.47 లక్షలు ఇంకా రూ. 1.49 లక్షలు. ఈ కొత్త బైక్ కోసం కంపెనీ ఈ రోజు నుంచి బుకింగ్స్ స్వీకరించే అవకాశం ఉంది. కావున ఈ బైక్ కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు కంపెనీ  అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఈ ఏడాది చివరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.కవాసకి డబ్ల్యు175 చూడటానికి చాలా కొత్తగా ఆధునిక డిజైన్ పొందుతుంది. ఇది కొంతవరకు దాని డబ్ల్యు800 ని పోలి ఉంటుంది, ఎందుకంటే డబ్ల్యు175 తన డబ్ల్యు800 నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. ఇందులో రౌండ్ హెడ్‌లైట్, టియర్-డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్ ఇంకా బాక్సీ సైడ్ ప్యానెల్ వంటివి W800 ని గుర్తుకు తెస్తాయి.


ఇక వెనుక వైపు టెయిల్-లైట్ మరియు ఇండికేటర్స్ వంటివి ఉన్నాయి, అంతే కాకుండా వెనుక భాగంలో ఒక వంపు తిరిగిన ఫెండర్‌ని కూడా చూస్తారు. ఇందులో సింగిల్ పీస్ సీటు ఉంటుంది. ఇది మంచి రైడింగ్ పొజిషన్ అందించడం వల్ల రైడర్ అద్భుతమైన రైడింగ్ అనుభూతిని కూడా పొందవచ్చు.ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో అనలాగ్ స్టైల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ మరియు టర్న్ సిగ్నల్స్‌తో ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా అందుబాటులో ఉంటుంది. పరిమాణం పరంగా కవాసకి డబ్ల్యు175 పొడవు 2,006 మిమీ, వీల్‌బేస్ 1,320 మిమీ మరియు సీటు ఎత్తు 790 మిమీ వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: