ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సిటీల్లో బ్రతుకుతున్న జనాలందరూ లగ్జరీ లైఫ్ కి అలవాటు పడ్డారు. ఇక అందుకోసం ఎంత ఖర్చు చేయడానికి కూడా అస్సలు వెనుకాడటం లేదు.ఖచ్చితంగా సొంత ఇల్లు, కారు ఉండాలని ఎంతగానో ఆశ పడుతున్నారు.అలాగే బ్యాంకులు కూడా వీటికి సంబంధించి లోన్ లు ఇస్తూ ఉండటంతో వీటిని కొనడానికి చాలా మంది కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కార్ల విషయానికి వస్తే ఫ్యామిలీతో బయటకు వెళ్లడానికి బైక్ ల కంటే కార్లు ఖచ్చితంగా చాలా కంఫర్ట్ గా ఉంటాయి. పైగా ఎయిర్ పొల్యూషన్ ఉండదు. అందుకే కుటుంబం కోసమైనా చాలా మంది కారు కొనాలనుకుంటున్నారు.అయితే కొత్తకారు కొనే స్తోమత లేని వారు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగులు చేస్తున్నారు. ఇంకా అంతేకాదు ఈ ఏడాది హైదరాబాద్ లో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ అమ్మకాలు మొత్తం 156 శాతం పెరిగినట్లు ఓ సర్వేలో తేలింది. పైగా సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా బ్యాంకులు లోన్ ఇవ్వడం వీటి అమ్మకాలకు ఊతమిచ్చినట్లు అయ్యింది.


మైలేజీ, ప్రీమియం ఫీచర్స్‌, ఎయిర్‌బ్యాగ్‌లు, డ్రైవర్‌ అసిస్ట్‌ సిస్టమ్స్‌, ఆటోప్లే మ్యూజిక్‌ సిస్టమ్స్‌, సన్‌రూఫ్స్‌ ఇంకా అడ్వాన్స్‌ టెక్నాలజీ సెకండ్ హ్యాండ్ కారు కొనే వారు ఇవన్నీ మొదటగా చూస్తున్నారు.ఇవి బాగుంటేనే ఆ కారును తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు.ఇక ఈ కార్ ధర విషయానికి వస్తే కేవలం ఆరు లక్షల లోపు ఉండే కార్లను తీసుకోవడానికి జనాలు మొగ్గు చూపుతున్నాయి. సెకండ్ హ్యాండ్ లో కూడా కొన్ని కార్ల మోడళ్లను వినియోగదారులు చాలా ఎక్కువగా కొంటున్నారు. ముఖ్యంగా వాటిలో మారుతి స్విఫ్ట్‌, వ్యాగనార్, ఆల్టో, బాలెనో కార్లు ఉన్నాయి. ఇంకా ఇవేకాకుండా ఐ20 సిటీ, రెనో క్విడ్‌, ఐ20 సిటీ, వోక్స్ వాగన్ పోలోలు కూడా ఉన్నాయి. వీటిని ఆయా కంపెనీలు జీరో పేమెంట్ తో అందిస్తూ ఉండటంతో వీటి డిమాండ్ కూడా బాగా పెరిగింది. జీరో డౌన్‌ పేమెంట్‌తో కార్లు తీసుకునే వారి సంఖ్య హైదరాబాద్ లో  ఏకంగా 142 శాతం పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: