స్టాక్ మార్కెట్లో మీకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే సహనం. కేవలం సహనం ఉంటే చాలు స్టాక్ మార్కెట్లో ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. అందుకు అనేక ఉదాహరణలను కూడా చెప్పుకోవచ్చు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం కొన్నటువంటి స్టాక్స్ ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల విలువ పలుకుతున్నాయి.ఇక ఆ కోవకు చెందిందే పిడిలైట్ స్టాక్, ఈ స్టాక్ ఇన్వెస్టర్ల డబ్బును చాలా రెట్లు పెంచింది.నిజానికి రియల్ ఎస్టేట్, బంగారం, ఇతర అసెట్ క్లాసెస్ తో పోల్చితే స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిటర్న్ సంపాదించుకోవచ్చు. ఇందులో రిస్క్ ఉన్నప్పటికీ, కాస్త ఆలోచించి ఫండమెంటల్స్ ఫాలో అయి మార్కెట్ ను స్టడీ చేసి పెట్టుబడి పెడితే చక్కటి రిటర్న్ పొందవచ్చు.స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి మంత్రం ఏమిటంటే,మీరు అనుకున్న రేటు వచ్చే వరకూ, వేచి ఉండటమే, ఫెవికాల్ వంటి ప్రముఖ ఉత్పత్తులను తయారు చేసే పిడిలైట్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా బంగారు బాతు గుడ్లు అని నిరూపించాయి. సరిగ్గా 23 సంవత్సరాల క్రితం, ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో డబ్బు పెట్టుబడి పెట్టి తన పెట్టుబడిని కొనసాగించిన పెట్టుబడిదారుడు కచ్చితంగా కోటీశ్వరుడు అయ్యేవాడని స్టాక్స్ నిపుణులు చెబుతున్నారు.సెప్టెంబర్ 5, సోమవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లో పిడిలైట్ ఇండస్ట్రీస్ షేరు రూ.2,839 వద్ద ముగిసింది. 1 జనవరి 1999న NSEలో ట్రేడింగ్ ప్రారంభించినప్పుడు, దాని షేర్ల ధర రూ.6.26 మాత్రమే.


ఈ విధంగా, 23 సంవత్సరాలలో, ఈ స్టాక్ దాని పెట్టుబడిదారులకు దాదాపు 45,251 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది.మనీకంట్రోల్ వెబ్ సైట్ నివేదిక ప్రకారం, గత నెలలో పిడిలైట్ ఇండస్ట్రీస్ షేరు ధర 7.16 శాతం పెరిగింది. 2022 సంవత్సరంలో ఇప్పటివరకు, ఈ స్టాక్ దాని పెట్టుబడిదారులకు సుమారు 14.76 శాతం రాబడిని ఇచ్చింది. ఈ షేరు ఒక్క ఏడాదిలో 21.25 శాతం లాభపడింది. అదేవిధంగా, గత 5 సంవత్సరాలలో, ఇది దాని పెట్టుబడిదారుల డబ్బును సుమారు రెండున్నర రెట్లు అంటే 236.51 శాతం పెంచింది. 10 ఏళ్లలో షేరు ధర 1,280 శాతం పెరిగింది.ఇక దీర్ఘకాలంలో ఈ పిడిలైట్ స్టాక్ పెట్టుబడిదారులను ధనవంతులను చేసింది. 23 ఏళ్ల క్రితం ఈ స్టాక్‌లో రూ.లక్ష పెట్టుబడి పెట్టి తన పెట్టుబడిని నిలబెట్టుకున్న ఇన్వెస్టర్ ఇంకా ఆ ఇన్వెస్టర్ నేడు కోటీశ్వరుడు. ఎందుకంటే అతని రూ. 1 లక్ష ఈ కాలంలో రూ.4.53 కోట్లకు పెరిగింది. అదే విధంగా 1999 జనవరి 1న పిడిలైట్ ఇండస్ట్రీస్ షేర్లలో కేవలం 25 వేలు మాత్రమే పెట్టుబడిదారుడు పెట్టుబడి పెడితే.. ఈరోజు రూ.1.13 కోట్లు సంపాదించుకునేవాడు.పిడిలైట్ ఇండస్ట్రీస్ అనేది లార్జ్ క్యాప్ కంపెనీ. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం రూ.1.44 లక్షల కోట్లు. ఇది నిఫ్టీ నెక్స్ట్-50 ఇండెక్స్‌లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం 107.65 PE వద్ద ట్రేడవుతోంది. ఫెవికాల్‌తో పాటు, పిడిలైట్ ఇండస్ట్రీస్ ఫెవిక్విక్, డాక్టర్ ఫిక్సిట్, రోఫ్, సైక్లో, రాణిపాల్, MCL వంటి ఎన్నో పాపులర్ బ్రాండ్‌లను కలిగి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: