అలొవెరా అందానికి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనితో తయారు చేసిన డ్రింక్ బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పని చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జీర్ణశక్తిని పెంచి శరీరంలో అధిక కొవ్వును కరిగిస్తుంది. అలాగే నిమ్మకాయ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ సి అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది. అదే విధంగా అల్లం కూడా బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. అల్లాన్ని థర్మోజెనిక్ ఫుడ్ గా నిపుణులు చెబుతారు. ఇది శరీరంలో జీవక్రియల రేటును శరీర ఉష్ణోగ్రతను పెంచి బరువు తగ్గేలా చేస్తుంది. తేనె కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. బరువు తగ్గడంలో తేనె కూడా ఎంతగానో సహాయపడుతుంది.ఒక డ్రింక్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం అల్లం, నిమ్మరసం, అలొవెరా జ్యూస్, తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. అలొవెరా జ్యూస్ అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇందులో 75 విటమిన్స్ తో పాటు మినరల్స్, అమినో యాసిడ్లు, ఎంజైమ్స్, ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి శరీరంలో జీవక్రియల రేటును పెంచుతాయి. శరీరంలో వ్యర్థ పదార్థాలను తొలగించడంలో కూడా ఈ జ్యూస్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.


ఇక ఈ  డ్రింక్ ను తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ లో నీటిని తీసుకోవాలి. తరువాత అందులో ఒక టీ స్పూన్ అలొవెరా జ్యూస్, ఒక టీ స్పూన్ అల్లం రసం, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనెను వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల అలొవెరా డ్రింక్ తయారవుతుంది. దీనిని డ్రింక్ ను రోజూ ఉదయం , సాయంత్రం తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అదే విధంగా తేనె, నిమ్మరసం కలిపిన నీటిని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.ఈ నీటిని తయారు చేసుకోవడానికి ఒక కప్పు గోరు వెచ్చని నీటిని, ఒక నిమ్మకాయను, తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నీటిలో ఒక టీ స్పూన్ తేనె, అర చెక్క నిమ్మరసాన్ని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ ఉదయం పరగడుపున మూడు నెలల పాటు క్రమం తప్పకుండా తాగాలి. ఇలా చేయడం వల్ల అధిక బరువును చాలా తేలికగా తగ్గవచ్చు. వ్యాయామం చేస్తూ తేనె, నిమ్మరసం కలిపిన నీటిని తాగడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గుతారు.కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: