హైదరాబాద్ గాంధీభవన్‌లో జరిగిన  సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ  జన్మదినం రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటన జరిగిన డిసెంబర్ 9 ఈరోజుచాలా చారిత్రాత్మకమైన రోజు అన్న  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కయయ యూపీఏ ప్రభుత్వం ఈ రోజునే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందని గుర్తు చేసుకున్నారు.


ప్రజల సంపదను ప్రజలకు పంచడానికి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు జరిగిందని.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని ప్రజలు సంతృప్తిగా జీవించడానికి దశాబ్ద కాలం ఎదురు చూడాల్సి వచ్చిందని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోసం అద్భుతమైన తీర్పు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: