ఒకప్పుడైతే మనుషులు మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు.  అయితే సొంత వాళ్ళ విషయంలోనే  కాదు ఇక ముక్కు మొఖం తెలియని వారికి కష్టం వచ్చినా అయ్యో పాపం అంటూ సహాయం చేయడానికి ముందుకు వెళ్లేవారు. ఇక కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి తమ వంతు పాత్ర పోషించే వారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం మనుషులు కర్కశత్వానికి ఉన్మాదానికి రాక్షసత్వానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. అడవుల్లో ఉండే క్రూరమృగాల కంటే దారుణం గా వ్యవహరిస్తూ సాటి మనుషులను హింసిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే.


 నేటి రోజుల్లో మనుషులు సాటి మనుషుల విషయంలో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఎక్కడ మానవత్వం బ్రతికే ఉంది అని మాత్రం అనిపించడంలేదు ఎవరికీ. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు సెల్ఫోన్ దొంగలించాడు అంటూ స్థానిక ప్రజలందరూ ఆరోపించారు. ఈ క్రమంలోనే అతనిపై దాడి చేసి దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా మరింత రాక్షసానందం పొందేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇక ఒక లారీకి ముందు భాగంలో తాళ్లతో అతని కట్టేశారు. ఇక ఆ తర్వాత ఆ లారీని ఎంతో వేగంగా ముందుకు నడిపించారు.


 దీంతో ఆ యువకుడు తీవ్ర భయాందోళనకు గురై మీకు దండం పెడతా ప్రాణాలు పోయేలా ఉన్నాయి.. నన్ను దింపండి  అంటూ ఎంత వేడుకున్నా అక్కడున్న వారు కనికరించలేదు. ఇదంతా సెల్ ఫోన్ లో వీడియో తీశారు. తప్ప అయ్యో పాపం అని మాత్రం ఎవ్వరూ అనలేదు అని చెప్పాలీ. ఈ ఘటన కటక్ జగత్సింగ్పూర్ జిల్లా పరదీప్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. యువకుడు ఫోన్ దొంగలీస్తున్న సమయంలో చూసిన లారీ డ్రైవర్లు అతన్ని ఒక లారికీ ముందు భాగంలో కట్టి రాక్షస ఆనందం పొందారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: