అది ఎప్పుడూ జనాలతో ఎంతో రద్దీగా ఉండే మార్కెట్. ఇక ఇంత రద్దీ మార్కెట్ అన్న తర్వాత అక్కడక్కడ చెత్తకుప్పలు దర్శనమివ్వడం జరుగుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ కనిపించినట్లు గానే అక్కడ చెత్త కుప్పలు కనిపించాయ్. అయితే ఆ చెత్త కుప్పల దగ్గర మాత్ర అనుమానాస్పదంగా కనిపిస్తూ అందరి   దృష్టిని ఆకర్షించింది ఒక బ్యాగ్. దీంతో అందరూ మార్కెట్ లో అటూ ఇటూ తిరుగుతూ ఆ బ్యాగును అనుమానాస్పదంగా చూస్తున్నారు తప్ప... అందులో ఏం ఉండి ఉంటుందా అని చూడటానికి మాత్రం ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు.  కానీ ఒక వ్యక్తి మాత్రం కాస్త ముందడుగు వేసి అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగ్ లో ఏముందో అని ఇప్పి చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు.


 ఇంతకీ అలా అనుమానాస్పదంగా కనిపించిన ఆ బ్యాగ్ లో ఏమున్నాయో తెలుసా.. ఏకంగా అస్తిపంజరాలు. అవాక్కవుతున్నారు కదా.. కానీ ఈ ఘటన నిజంగానే జరిగింది. ఇలా బ్యాగులో అస్తిపంజరాలు చూసి ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు అందరూ.. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. సిలిగురి ప్రాంతం నక్సల్బరి మార్కెట్ లోని ఓ బంగారు దుకాణం వెనుక స్థానిక నివాస కి అనుమానాస్పదంగా ఒక బ్యాగు కనిపించింది.  అందులో ఏం ఉండి ఉంటుందా అని వెళ్లి ఆ బ్యాక్ విప్పి చూశాడు.  దీంతో ఒక్కసారిగా అతని వెన్నులో వణుకు పుట్టింది.


 కారణం ఆ బ్యాగులో కుప్పలుగా అస్తిపంజరాలు కనిపించడమే. స్థానికులు సైతం ఆ అస్తిపంజరాలను   చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఇంకేముంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రావాలి అంటూ పిలిచారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆస్తి పంజరం లో ఉన్న ఆ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.  అయితే ఆ బ్యాగ్ లో పుర్రె ఎముకలు కాళ్ళు చేతులకు సంబంధించిన ఎముకలు ఉన్నాయని గుర్తించారు. వాటిపై ఇంగ్లీష్ అక్షరాల్లో పేర్లు కూడా రాసి ఉన్నట్లు డాక్టర్ల గుర్తించగా ఇక దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bag