ఇటీవల కాలంలో ఎంతోమంది విషయాల్లో మృత్యువు వెంటాడుతూ ఉండటం చూస్తూ ఉంటే ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారు అన్నది ఊహకందని విధంగానే మారిపోయింది. ఒకప్పుడైతే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏదో ఒక అనారోగ్య సమస్య బారిన పడి ప్రాణాలు వదులుతారు అని అనుకునేవారు. కానీ ఇటీవలి కాలంలో చదువుకునే పిల్లలు.. జాబ్ చేసే యువకులు.. కుటుంబ బాధ్యతలు  చూసుకునే మిడిల్ ఏజ్ వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా ఏదో ఒక ఘటన కారణంగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవలే గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది అని చెప్పాలి.


 అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో రక్షణ కాలవ్యవధిలో  గుండెపోటు వచ్చి కేవలం అప్రమత్తం అయ్యేలోపే నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతోమంది. ఇలా గుండెపోటు కారణంగా అప్పటి వరకు సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నవారు. క్షణకాల వ్యవధిలోనే కళ్ళముందే ప్రాణాలు వదులుతున్న ఘటనలు సోషల్ మీడియాలో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే నెల్లూరు జిల్లా వింజమూరు లో కూడా ఇలాంటి విషాదకర ఘటన చోటు చేసుకుంది అనే చెప్పాలి. ఏడవ తరగతి చదువుతున్న చిన్నారి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చివరికి ప్రాణాలు వదిలింది.


 ఎప్పటిలాగానే స్కూలుకు వెళ్లిన చిన్నారి సాజిదా గదిలోనే ప్రాణాలు వదిలింది. వెంటనే అప్రమత్తమైన టీచర్లు సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. క్లాస్ రూమ్ లో టీచర్ విద్యార్థులందరినీ ప్రశ్నలు అడుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది అనేది తెలుస్తుంది. ఇక అందరు విద్యార్థులు లాగానే ఆ బాలికను కూడా నిలబెట్టి ప్రశ్నలు అడిగింది టీచర్. ఇలా ప్రశ్న అడిగిందో లేదో అంతలోనే విద్యార్థి కుప్పకూలిపోయింది. దీంతో భయపడిపోయిన టీచర్ వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: