
ఎక్కడికైనా వెళ్లాలంటే సెల్ ఫోన్ లో ఉన్న ఈ యాప్ లో క్యాబ్ బుక్ చేసుకోవడం.. ఇక ఆ తర్వాత ఎంతో సాఫీగా ప్రయాణం చేయడం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి అందరిలాగానే క్యాబ్ బుక్ చేసుకున్నాడు. కానీ కొంత దూరం వెళ్ళిన తరువాత మరో దారి లో వెళ్లాలి అంటూ క్యాబ్ డ్రైవర్ కు దారి మళ్లించాడు. ఇక ఆ తర్వాత అతని మనసులో ఉన్న దుర్బుద్ధి బయటపెట్టి షాకిచ్చాడు. పథకం ప్రకారం మరో మిత్రుడితో కలిసి క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసి గాయపరిచాడు. అంతే కాదు చోరీకి పాల్పడ్డాడు. ఇక ఈ ఘటన తో ఒక్కసారిగా క్యాబ్ డ్రైవర్ షాక్ లో మునిగిపోయాడు. విజయవాడ కృష్ణలంక బాలాజీ నగర్ లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.
పృథ్వి రాజ్ అనే యువకుడు డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం పార్ట్ టైం గా రాపిడో బైక్ క్యాబ్ సర్వీస్ ను నడుపుతున్నాడు. ఇక ఇటీవలే అర్ధరాత్రి 12 గంటల సమయంలో అతనికి ఒక బుకింగ్ వచ్చింది. దీంతో ఇక ఎప్పటిలాగానే కస్టమర్ దగ్గరికి వెళ్ళాడు పృథ్వీరాజ్. ఇక తనను గన్నవరం తీసుకువెళ్లాలి అంటూ కస్టమర్ కోరడంతో అతని అభ్యర్థన మేరకు బైక్ పై ఎక్కించుకుని బయలుదేరాడు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి కూడలి చేరుకోగానే మరో వైపు వెళ్లాలి అంటూ కస్టమర్ సూచించాడు. అయితే పథకం ప్రకారమే అక్కడ వేచి చూస్తున్న మరో స్నేహితుడితో కలిసి పృథ్వి రాజ్ పై దాడికి పాల్పడ్డాడు. అతని దగ్గర నుంచి ద్విచక్రవాహనం ఏటీఎం కార్డ్ సెల్ఫోన్ నగదు లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు ఇద్దరు యువకులు. గాయాలపాలైన పృథ్విరాజ్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..