ఇటీవల కాలంలో సినిమాల ప్రభావం ప్రేక్షకులపై ఎక్కువగా ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఎన్నో తరహా ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే సినిమాల్లో చూపించిన మంచి ఎవరు ప్రయత్నించడం లేదు. కానీ సినిమాల్లో నేరాలకు ఎలా ప్లాన్ వేయాలి అన్నది చూపిస్తే దాన్ని మక్కికి మక్కిగా నిజ జీవితంలో కూడా ఫాలో అవుతూ ఉన్నారు ఎంతోమంది. ఈ క్రమంలోనే ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లలో చూపించినట్లుగానే నేరాలకు పాల్పడుతూ ఉన్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఇకపోతే గతంలో పుష్ప సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సమయంలో ఎంతో మంది గంధపు చెక్కులు స్మగ్లింగ్ పుష్ప సినిమా స్టైల్ లోనే చేయడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు ఇలాగే ఒక మూవీ ని చూసి బాగా ప్రభావితమైన దొంగ ఏకంగా బ్యాంకుకు కన్నం వేసేందుకు ప్రయత్నించాడు. ఇటీవల తమిళ హీరో అజిత్ నటించిన తెగింపు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా మొత్తం బ్యాంకు రాబరీ చుట్టే తిరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ సినిమా తరహా లోనే పక్కా ప్లాన్ తో బ్యాంకుకు కన్నం వేయాలనుకున్న ఒక వ్యక్తి కటకటాల పాలయ్యాడు.


 తాడికొంగులోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఖలీల్ రెహమాన్ అనే వ్యక్తి కారంపొడి, పెప్పర్ స్ప్రే, కత్తి తీసుకొని చొరబడ్డాడు. అదే సమయంలో విధుల్లో ఉన్న ముగ్గురు బ్యాంకు సిబ్బందిపై పెప్పర్ స్ప్రే చల్లి వారినీ ప్లాస్టిక్ బ్యాగులతో బంధించాడు. అయితే ఓ ఉద్యోగి ఎంతో చాకచక్యంగా  తప్పించుకొని చివరికి బయటకి పరుగులు పెట్టాడు. ఈ క్రమంలోనే బయట ఉన్న సెక్యూరిటీ సిబ్బందితోపాటు ఇక స్థానికులను సైతం అప్రమత్తం చేశాడు. దీంతో ఇక లోపలికి వెళ్ళిన స్థానికులు ఎంతో చాకచక్యంగా ఖలీల్ రెహమాన్ ను పట్టుకొని చివరికి పోలీసులు అప్పగించారు. అయితే పోలీసులు విచారణ చేపట్టగా అజిత్ తెగింపు సినిమా చూసి ఇక దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పడంతో షాక్ అయ్యారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: