బెంగాల్ టైగ్రెస్ మమత బెనెర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విస్మయం కలిగించిన విజయం వెనుక దేశం కోల్పొయిందేమిటో తెలుసా? విదేశీ మతవాద శక్తులకు ప్రత్యేకించి ఉగ్రవాద మూకలైన రోహ్యాంగాలకు బెంగాల్ అధికారంలో ఉన్న టిఎంసి ప్రభుత్వం ముఖద్వారాలు బార్లా తెరిచి పెట్టింది. నిజంగా చెప్పాలంటే బెంగాల్లోని కొన్ని నియోజక వర్గాల్లోని ఓటర్లు పదిహేను నుంచి ముప్పై శాతం వరకు పాక్, బంగ్లా నుంచి వచ్చి ఇక్కడ  ఓటర్లుగా నమోదు చేసుకున్న వారే నని కొన్ని సర్వేలు గణాంకాలు చెపుతున్నాయి.


ఇదేప్పటికి భారత్ కు శ్రేయోదాయకం కాదు. దీన్ని ప్రొత్సహించే నాయకత్వం ఏదైనా దిగ్విజయం సాధించినా దేశ విశాల ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్లే. దానిని ఈషణ్మాత్రం శంఖించాల్సిన పనిలేదు. ఇలా జరగటం విదేశీ శక్తులు మనదేశంలో తిష్ట వేసుకొని భారత ప్రజాస్వామ్యం నరనరాల్లోని సారాన్ని గుంజేస్తున్నట్లే. అలాంటి పార్టీలను ఓటేసి గెలిపించిన దానికి ఈ దేశ ప్రజలు సమీప భవిష్యత్లో మూల్యం చెల్లించుకోక తప్పదు.


పశ్చిమ బెంగాల్ ఎన్నికల తదనంతర రాజకీయాలు మళ్లీ వేడెక్కడం ప్రారంభించాయి. ఎన్నికలకు ముందున్న స్థాయిని మించి ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ పార్టీలు నామరూపాలు  లేకుండా ఓటమి చవిచూడగా ఏకైక బలమైన విపక్షంగా మిగిలిన బీజేపీకి మధ్య తీవ్ర వివాదాలు విభేదాలు ఎలా సాగాయో ఇప్పుడు మళ్లీ అంతకు మించిన వివాదాలు సాగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.


ఇక్కడ జరిగిన శాసనసభ ఎన్నికల్లో బెంగాల్ సింహపీఠిపై కమలానికి  కమల పట్టాభిషేకం చేసి తీరుతామన్న బీజేపీ నాయకులు, సర్వ్శక్తులను ఒడ్డారు. తీవ్రంగా పోరాడారు. అయినా చివరకు "ప్రతికూల ప్రజాతీర్పు" మాత్రం వారికి లభించింది. ఘనతర విజయం విజయ దుంధుబులనాదంతో మమతా బెనర్జీనే వరించింది. 


అయితే ప్రజలు ఇచ్చిన తీర్పుతో మారాల్సిన బీజేపీ పెద్దలు పైకి సహకరిస్తామని చెబుతూనే, అంతరాంతరాల్లో మాత్రం మమతను ఇరుకున పెట్టే నిర్ణయాన్ని స్థిరంగా తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుందని పరిశీలకులు చెపుతున్నారు.


ఈ వ్యూహం ప్రాతిపదికనే "ఎన్నికల హింస మరియు ఎన్నికల అనతరం చెలరేగిన హింస" ను తెరమీదికి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. నాలుగో దశ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో తీవ్రంగా పోలీసు కాల్పులు జరిగాయి ఫలితంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే అప్పట్లో మీరంటే మీరేనని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న టీఎంసీ బీజేపీ నేతలు ఎన్నికలు ముగిసే వరకు వేచిచూసే ధోరణిలో మౌనంగా ఉండిపోయారు.


బంగాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. ఎన్నికల అనంతర హింసలో మరో పదకొండు మంది చనిపోయారు. ఈ పరిణామాలపై నివేదిక పంపాలని బంగాల్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. అయితే సమగ్ర నివేదిక పంపకుండా, మమత ప్రభుత్వం స్పందించక నిర్లక్ష్యం వహించిందని కేంద్రం తెలిపింది. నివేదిక పంపక పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

వెంటనే  ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై కేంద్రం చర్యలకు పూనుకుంది. ఆ హింసకు కారణాలను వెతికేందుకు ముందు అసలు ఏం జరిగిందో? ఎలా జరిగిందో? పరిశోధించేందుకు "నలుగురు సభ్యుల నిజ నిర్హారణ బృందం" ద్వారా కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. ఈ బృందానికి “హోంశాఖ అదనపు కార్యదర్శి” నేతృత్వం వహిస్తారని కేంద్రం తెలిపింది. వీరంతా ఇప్పటికే బంగాల్ చేరారని వెల్లడించింది.


సాధారణంగా ఎన్నికల సమయంలో జరిగిన హింసపై విచారణ కేంద్ర ఎన్నికల సంఘం ఫిర్యాదు ఆధారంగా జరగాల్సి ఉండగా, దీన్ని అత్యుత్సాహంతో కేంద్ర హోం శాఖ  తన చేతిలోకి తీసుకోవడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి మమత మళ్లీ తనదైన తనకే స్వంతమైన ఆరోపణల గళం వినిపించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కేంద్రం రాష్ట్ర అధికారాలలోకి చొరబడే ప్రయత్నం చేస్తుందని రాష్ట్రం పై కేంద్రం పెత్తనం సహించబోమని ఆమె ఇప్పటికే ఆరోపించిన నేపథ్యంలో తాజా పరిణామం మరింతగా ఇరు పక్షాల మధ్య వివాదానికి ఆజ్యం పోసిందని ఇక రాజకీయ జ్వాల రగలటమే ఆలస్యమని పరిశీలకుల భావన.

మరింత సమాచారం తెలుసుకోండి: