
ఒక ప్రముఖ ఛానల్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో జెడి లక్ష్మీనారాయణ .. ఏపీలో వైసీపీ ఎందుకు ఓటమి అయిందనే విషయంపై మాట్లాడుతూ.. వైసిపి ఐదేళ్ల పాలనలో మంచి జరిగింది అలాగే చాలా ఇబ్బంది కలిగించే సంఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. పలు రకాల సాగిన ప్రచారం వల్ల జగన్ ఓడిపోయారని తెలిపారు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ సర్కార్ ని పెద్ద దెబ్బ వేసిందని ఇది కీలకమైన పాత్రగా మారిందని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రభుత్వం తమ భూములను లాగేసుకుంటుందని జనాలను చాలా నమ్మబలికేల బలంగా చేశారని తెలిపారు జేడి లక్ష్మీనారాయణ.
ముఖ్యంగా పట్టాదారు పాసుబుక్కుల పైన జగన్ బొమ్మ అలాగే సర్వే రాళ్లపైన జగన్ బొమ్మ ఉండడంతో ఈ భూములను ప్రభుత్వం తీసుకుంటుంది అంటూ ప్రజలను భయపడేలా చేశారని.. కొంతమంది న్యాయవాదులు కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో చాలా ఆందోళనలు చేశారని ఇది ప్రజలను భయానికి గురిచేశాయని తెలిపారు.. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకువచ్చిందని తెలిపారు. కూటమి పార్టీలు ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో వైసిపి పార్టీకి చాలా నష్టం జరిగిందని తెలిపారు.
వైసిపి హయాంలో చాలానే మంచి పనులు జరిగాయని.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం ప్రభుత్వ బడులలో నాడు నేడు పేరుతో అభివృద్ధి చేసి చూపించారు.. ప్రభుత్వ ఆసుపత్రులలో చాలా మార్పులు వచ్చాయి.. ఓకే డేట్ టైమ్ వల్ల సంక్షేమ పథకాలు అందించారు. ఇలా ఎన్ని చేసినా కూడా టిడిపి కూటమి పార్టీలు కలవడంతో వారి బలం కూడా పెరిగిందని. ప్రభుత్వం మీద ఉన్న ప్రజా వ్యతిరేకతతో జగన్ ఓడిపోయారని తెలిపారు జేడీ లక్ష్మీనారాయణ.