బ్రిటన్ లో ప్రధాన మతం అయిన క్రైస్తవం రెండో స్థానానికి పడిపోయింది. మిగతా అన్ని మతాలు, వివిధ దేశాల నుంచి వచ్చిన వారు ఉండటం వల్ల రెండో స్థానానికి చేరుకుంది. భారతదేశంలో గతంలో క్రైస్తవ మతం లేదు. బ్రిటష్ వారి పరిపాలనలో వారు ప్రార్థనలు చేసుకునేందుకు ఇండియాలో చర్చిలు కట్టుకున్నారు. అనంతరం వారి ఇళ్లల్లో పనులు చేయాలంటే క్రిస్టియానిటీ తీసుకుంటేనే అనుమతి ఇచ్చేవారు. అంటే మత మార్పిడితో హిందువులను, ముస్లింలను క్రైస్తవం వైపు మళ్లించేవారు. అలాంటిది ప్రస్తుతం బ్రిటన్ లో క్రైస్తవ మతం రెండో స్థానంలో కి వెళ్లిపోయింది.


బ్రిటిష్ పాలనలో ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్న క్రైస్తవ మతంలో చేరాల్సిందే. అధికారులను మెప్పించాలన్న అందులో ఉండాల్సిన పరిస్థితి. తద్వారా భారత్ లో క్రమంగా క్రైస్తవం పెరిగింది. బ్రిటన్ లో 2021లెక్కల ప్రకారం ఆయా ప్రజల్ని మతంపై అభిప్రాయం అడిగితే 50 శాతం మంది మాకు ఏ మతం అవసరం లేదని చెప్పారు.  2011 కేవలం ఇలాంటి వారు  37 శాతం ఉంటే 2021 నాటికి 51 శాతానికి పెరిగారు. ఇక్కడ పదిలో ముగ్గురు క్రైస్తవులు ఉండే పరిస్థితికి వచ్చింది.


మొత్తం క్రైస్తవ స్కూల్స్, యూనివర్సిటీలు ఉన్నా ఈ దేశంలో క్రైస్తవంపై నమ్మకం ఎక్కువ మంది కోల్పోవడం విచిత్రంగానే అనిపిస్తోంది. 9.8 మిలియన్ల క్రైస్తవులు, 13. 8 మిలియన్ల ప్రజలు ఏ దేవుడిపై నమ్మకం లేదని చెప్పారు. భారతదేశంలో 97 శాతం మంది దేవుడిని నమ్ముతున్నారు. అమెరికాలో క్రైస్తవానికి సంబంధించి చూస్తే 1990లో 91 శాతం ఆదరించే వారు ఉంటే, ప్రస్తుతం అది 81 శాతానికి పడిపోయింది. ముఖ్యంగా ప్రతి 7 గురిలో ఒకరు విదేశాల నుంచి వచ్చిన వారు కావడం వల్ల వారు వేరే మతానికి సంబంధించిన వారు అయి ఉండటం వల్ల  క్రైస్తవాన్ని ఆచరించే వారి సంఖ్య అమెరికాలో తగ్గినట్లయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: