వంట నూనెల ధరలు మరోసారి పెరిగిపోతున్నాయి. చైనా దేశానికి ఆయిల్ ఎగుమతి ఎక్కువగా సాగుతోంది. దీని వల్ల ఇక్కడ నూనెల ధరల రేట్లు ఒక్కసారి లీటరుకు 15 రూపాయల నుంచి 20 వరకు పెరుగుతోంది. వేరుశనగ నూనె ఫిబ్రవరి1 తేదీన 159 రూపాయలు ఉంటే ప్రస్తుతం 180 వరకు పెరిగింది. పామాయిల్ ధర 99 నుంచి 104కు పెరిగింది. పొద్దు తిరుగుడు నూనె ధర మాత్రం పెరగలేదు, తగ్గలేదు.


అయితే వ్యాపారులు చెబుతున్న అంశం వేరుశనగకి చైనా నుంచి డిమాండ్ ఎక్కువై ఇండియాలో నూనె ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు. దేశ వ్యాప్తంగా ఏడాది 104 లక్షల టన్నుల వేరుశనగ ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయిస్తే 100 లక్షల టన్నులు మాత్రమే వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14 న విడుదలైన రెండో ముందస్తు అంచనాల్లో ఈ విషయం వెల్లడైంది. దేశ వ్యాప్తంగా 9 రకాల నూనె గింజల పంటలను పండిస్తున్నారు. 423 లక్షల టన్నుల లక్ష్యంగా అనుకుంటే 400 లక్షల టన్నుల మేర వస్తుందని గుర్తించారు.


వేరుశనగ సాగు ఉత్పత్తిలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. మొత్తం ఉత్పత్తిలో 45 శాతం గుజరాత్ నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు నిలుస్తున్నాయి. గుజరాత్ లోని గోండల్ ప్రాంతాల్లో 100కు పైగా ఆయిల్ తయారు చేసే సంస్థలు ఉన్నాయి. ఏపీ కూడా అక్కడి నుంచి ఆయిల్ ను దిగుమతి చేసుకుని విజయ బ్రాండ్ పేరుతో అమ్మకాలు చేపడుతోంది.


ఈ ఏడాది గుజరాత్ లో అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మిగనూరు, తెలంగాణలో బాదేపల్లి ప్రాంతాల్లో సగటున క్వింటాలుకు 7,400 నుంచి 9400 వరకు పొందుతోంది. పొద్దు తిరుగుడు నూనె 135 రూపాయల వరకు పలుకుతుంది. ఇండోనేషియా ఆయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించడం, ఆయా ప్రాంతాల్లో ఉత్పత్తి తగ్గిపోవడం ఈ ఆయిల్ ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: