జగన్ పార్టీకి గ్రాడ్యుయేట్లు ఓట్లు వేయలేరు. బటన్ నొక్కితే చాలు ప్రతి ఇంటికి వైసీపీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయి. కాబట్టి వైసీపీకి గ్రాడ్యుయేట్లు ఓటేస్తారని సీఎం జగన్ అనుకున్నారు. కానీ అది జరగలేదు. అందరూ గ్రాడ్యుయేట్లు కచ్చితంగా వైసీపీకి ఓటేస్తారని ఎలా భావించారో అర్థం కావడం లేదు. కాబట్టి ఓటింగ్ విధానం వేరు. సంక్షేమ పథకాల అమలు తీరు వేరేలా ఉంటుందని ఆయన తెలుసుకోవాలి.


అయినప్పటికీ జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభిస్తున్నారు. విద్యా దీవెన పథకంలో డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. 2022 అక్టోబర్ సంవత్సరానికి సంబంధించి రూ.9.86 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో 698 కోట్ల రూపాయాల నగదును జమ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లో జరిగే కార్యక్రమంలో దీన్ని జమచేశారు. ప్రస్తుతం మార్చి నడుస్తోంది. అక్టోబర్ డిసెంబర్ లో వేయాల్సిన డబ్బులను ఇప్పుడు వేస్తున్నారు. మళ్లీ మూడు నెలలకు చెల్లించాల్సిన డబ్బులు మరో మూడు నెలలు పట్టే అవకాశం కనిపిస్తోంది.


ఈ పథకం కింద బోధన రుసుములు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటిస్తుంది. కానీ వైసీపీ చేస్తున్న పథకాలను గమనించుకుని గ్రాడ్యుయేట్లు ఓట్లేస్తారనే భ్రమలో ఉండిపోయారు. తీరా గ్రాడ్యుయేట్లు టీడీపీ అభ్యర్థికి ఓట్లేసి గెలిపించే సరికి జీర్ణించుకోలేకపోతున్నారు. పథకాలు అందడం వేరు, వాటిని ఓట్లుగా మలుచుకోవడం వేరు. ప్రతి దాన్ని సంక్షేమ పథకం కింద ఊహించుకోలేం.


ప్రజా క్షేత్రంలో లోకల్ ఎమ్మెల్యేల పనితీరు, ఎంపీల పనితీరు, ప్రభుత్వ పథకాలు, అన్ని పరిగణలోకి తీసుకుంటారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎమ్మెల్సీలను గెలిపించుకోలేక పోవడం  ఫెయిల్ అనే చెప్పొచ్చు. తెలంగాణలో అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం, తీన్మార్ మల్లన్న లాంటి గట్టి క్యాండెట్లు పోటీ కొచ్చినా, తెలంగాణ సీఎం కేసీఆర్ వేసిన ఎత్తుగడలతో పల్లె రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అలా చేయడంలో జగన్ వెనకబడ్డారనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: