చంద్రబాబు గారు మొన్న విసిరిన సెల్ఫీ ఛాలెంజ్ చాలా మంచిది.  టిడ్కో ఇళ్ల దగ్గరికి వెళ్ళి మీ సెల్ఫీలు పెట్టండి అన్నది. అదే సందర్భంలో అయినా ఆ ఇళ్ల ను పూర్తి చేయలేదన్న విషయం జనాలకి గుర్తుకొస్తుంది. కానీ రెండో ఛాలెంజ్ జనాలు చేయాలని కొంతమంది అంటున్నారు. రాజీవ్ గృహకల్ప ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు రాజశేఖర్ రెడ్డి టైంలో కొన్ని ఇచ్చారు, కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఈలోగా ఆయన చనిపోయారు. వాటిని రోశయ్య వదిలేస్తే, కిరణ్ కుమార్ రెడ్డి 10%-15% పూర్తిచేసి ఇచ్చారు. మిగతావన్నీ అలాగే ఉండిపోయినాయి.


ఆ తర్వాత చంద్రబాబు వచ్చారు, కానీ ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. కనీసం అవి పూర్తి చేసి ఇస్తే లక్షల మంది జనాభా కు ఇల్లు వచ్చేవి కదా. ఆయన హయాంలో ఏడు లక్షల మందికి ఇల్లు ఇస్తామని చెప్పి, అందులో నాలుగున్నర లక్షల  ఇళ్ళకు టెండర్లు పిలిచి అందులో ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు కూడా పూర్తి చేయలేదు. మన బాలయ్య ఏమో శిధిలం అయిపోతున్నాయి, ఇల్లు కూలిపోతున్నాయి అంటూ కామెంట్ చేశారు కదా. మరి ఆ ఇళ్ల ముందు కూడా సెల్ఫీలు తీసి పెడితే బాగుంటుంది కదా జనాలకి.


మరో విషయం ఏంటంటే.. వీళ్ళెవరు తమ సొంత డబ్బుల్ని ఏమీ ఇవ్వడం లేదు కదా. ఇంకోటి ఏంటయ్యా అంటే ఇంత ఖర్చు పెట్టి చేస్తున్న ఇళ్లను నాశనం చేసేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డికి పేరు వస్తుందని చంద్రబాబు నాయుడు తొక్కేశారు. చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందని జగన్ తొక్కేశారు. వీటి మధ్య నష్ట పోతుంది ఎవరు? పేరుకి లబ్ధిదారులకి కాగితాలు ఇస్తున్నారు పబ్లిక్ కి. ఇల్లు రెడీ చేయకపోవడం వల్ల నడిరోడ్డు మీద నిలబడుతున్నారు జనాలు. ఈ పాపమంత వీళ్ళది కాదా? వీళ్ళ ప్రచార ఇది కోసం సామాన్య జనాలతో ఆడుకుంటారా అని  ఇది చాలామంది జనాల ఓపెన్ ప్రశ్న.


మరింత సమాచారం తెలుసుకోండి: