రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఎక్కడి నుంచి ఏటు పోతుందో తెలియడం లేదు. రష్యా యుద్ద విమానాలు అవతలి ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. అయితే సముద్ర జలాల్లో, ఉక్రెయిన్ దేశంలో వాటిని అడ్డుకోవాలని అమెరికా గతంలో చూసినట్లు తెలుస్తోంది. ఇలా అడ్డుకుంటున్న సమయంలో బ్రిటన్ వాళ్ల ఎయిర్ క్రాప్ట్ లు రష్యా ను చూసి వెనక్కి వెళ్లిపోయినట్లు వార్తలు కూడా వినిపించాయి. ప్రస్తుతం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రష్యాకు చెందిన యుద్ద విమానాలు బాల్టిక్ సముద్ర ప్రాంతంలో వెళుతున్న సమయంలో జర్మనీ, బ్రిటన్ లు అడ్డుకున్నట్లు ఆ దేశాలు ప్రకటించాయి.


అవి ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు యూరో ఫైటర్స్ జెట్స్ గుర్తించినట్లు జర్మనీ, బ్రిటన్ దేశాలు తెలిపాయి. జర్మనీ రష్యా ఫైటర్ జెట్స్ ను ఫోటోలు  తీసినట్లు ప్రకటించింది. అందులో రెండు సుఖోయ్ యుద్ధ విమానాలు, ఒకటి టీయూజెన్ అనే ఒక పైటర్ జెట్ ఉన్నట్లు ప్రకటించింది. జర్మనీ ఎయిర్ పోర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎలాంటి సిగ్నల్స్ లేకుండా వేరే దేశ సముద్ర జలాల పైన రష్యా యుద్ద విమానాలు చక్కర్లు కొట్టినట్లు ప్రకటించింది.  రష్యా దీన్ని తీసిపారేసింది.


రష్యా యుద్ధ విమానాలు ఎప్పుడూ బాల్టిక్ సముద్ర జలాల నుంచి రష్యా నుంచి కాలిన్ గ్రాండ్ కు వెళాయతని చెప్పింది.  ఇది రోజు వెళ్లే ప్రాంతమని అవి వెళుతున్న సమయంలో బ్రిటన్, జర్మనీకి చెందిన ఎయిర్ క్రాప్ట్ లు అడ్డుకోవాలని చూశాయని రష్యా ప్రకటించింది. అయినా రోజు వెళ్లే ప్రాంతంలో వెళితే ఆ దేశాలకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించింది. అలా వెళుతున్న సమయంలో రష్యా ఫైటర్ జెట్ లను ఆపే ప్రయత్నం చేసినట్లు జర్మనీ చెప్పడం ఇక్కడ వింతగా అనిపిస్తుంది. రోజు వెళ్లే రూట్ లో రష్యా యుద్ధ విమానాలు వెళితే అడ్డుకోవడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమిటో జర్మనీ, దేశాలు చెప్పాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

war