జీవరాశి మనుగడకు అవసరమైన పంచభూతాలలో ఒకటి నీరు. ఈ నీరు మనకి వర్షాల రూపంలో, నదుల్లో, చెరువుల్లో, బావుల్లో లభిస్తుంది. ఇక నది అనేది ప్రత్యేకమైనది. ఎన్నో నదులపై రిజర్వాయర్లు, డ్యామ్ లు కట్టి నీటిని నిలువ చేసి వినియోగిస్తున్నారు. పండుగలు వస్తే చాలు హిందువులకు నదులు గుర్తు రావాల్సిందే. పండుగ దినాలలో నదీ స్నానం అత్యంత పుణ్యదాయకం అని మన పెద్ద వారి కాలం నుండి ఆచరణలో ఉంది. ఇలా నదులు పలు విధాలుగా ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

ప్రపంచంలో ఎన్నో నదులు ఉన్నాయి. అసలు నది అంటే ఏమిటి అంటే ? వర్షపు నీటి వలన కాని లేదా ఎత్తయిన పర్వతాలలో ఉన్నటువంటి మంచు కరిగి ఆ నీటి వలన కాని ఆ నీరు చిన్న చిన్న పాయలుగా కిందకి ప్రవహిస్తూ ఆ దారలన్నీ ఒకదానికొకటి ఏకమై ఒక పెద్ద ప్రవాహంగా మారడాన్నే నదిగా పరిగణించబడుతుంది. సాధారణంగా చాలా వరకు పెద్ద పెద్ద నదులన్నీ పర్వత ప్రాంతాలలో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో కలిసిపోతాయి. కొన్ని నదులు మాత్రం భూమిలోనే ఇంకిపోతుంటాయి. కాగా నిత్యం ప్రవహించే నదులను జీవ నదులు అంటాము.

ఇక ప్రపంచంలో అతి పెద్ద నది ఏమిటి అంటే అమెజాన్. అయితే అతి సన్నటి నది ఏమిటి అంటే మాత్రం సమాధానం బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. అదే చైనాలోని మంగోలియాలోని 'హులాయి' నది. చూడటానికి పిల్ల కాలువలా ఉండే ఈ నీటి ప్రవాహం నిజానికి ఒక నది. చూడటానికి పిల్ల కాలువలా కనిపిస్తుంది కానీ ఈ నది 10 వేల ఏళ్లుగా నిరంతరం ప్రవహిస్తూనే ఉండటం విశేషం. ఇది ఒక జీవ నదనే చెప్పాలి. దీని వెడల్పు 15 సెంటీమీటర్ లు, కొన్ని చోట్లయితే మరీ 4 సెంటీమీటర్ లు మాత్రమే కలిగి ఉంటుంది. ఈ నది మొత్తం పొడవు 17 కిలోమీటర్లు. ఒక నదికి ఉండాల్సిన పచ్చిక బయళ్ళు , పరీవాహిక ప్రాంతం వంటివి ఈ నదికి కూడా ఉండటం నిరంతరం ప్రవహిస్తూనే ఉండటంతో చైనా దేశం ఎప్పుడో ఈ ప్రవాహాన్ని నదిగా ప్రకటించింది. ఇది ఒక వింత నది పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: