సినిమాలు చేసినా చేయకపోయినా పవన్ అభిమానులు ఎక్కడా చెక్కుచెదరలేదు. అసలు ఆ అభిమానుల అండదండలు చూసుకునే, రాజకీయంగా ఎంట్రీ ఇచ్చి జనసేన పార్టీని పవన్ స్థాపించారు. కానీ కొన్ని కొన్ని వ్యూహాత్మక తప్పిదాల కారణంగా అధికారం వైపు నడిపించలేకపోయినా, పార్టీ భవిష్యత్తుపై అందరికీ అనుమానాలు తలెత్తుతున్న సమయంలోనూ, పవన్ ను విడిచి నాయకులంతా దూరమైనా, ఆయన అభిమానులు మాత్రం ఎక్కడ దూరం కాలేదు రాజకీయంగా పవన్ సక్సెస్ అయినా, కాకపోయినా ఆయన మాటే మా బాట అన్నట్లుగా జనసేన కు పవన్ అభిమానులు అండదండగా నిలబడుతున్నారు.పవన్ పిలుపు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను భుజాన వేసుకుని మోస్తున్నారు. జనసేన పేరుతో పవన్ తరపున అభిమానులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల్లో పార్టీ ఇమేజ్ మరింత పెరిగే విధంగా, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పవన్ కు మరింత మంచి పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ రాజకీయంగా సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా ఎప్పుడూ ప్రజల బాగోగులు చూసుకుంటారు అనే అభిప్రాయం జనసైనికులు జనాల్లో కలిగేలా చేస్తున్నారు. పవన్, జనసేన పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తాజాగా ఈ రోజు పుట్టిన రోజును పురస్కరించుకుని పది రోజులు ముందు నుంచే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ లను రాష్ట్ర వ్యాప్తంగా పవన్ అభిమానులు అందించి తమ ఉదారతను, పవన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకుని పవన్ ఇమేజ్ ను మరింతగా జనాల్లో పెరిగేలా చేశారు. పవన్ నడిచేది పూలబాట ముళ్ళ బాట అనేది పట్టించుకోకుండా, ఆయన దారే మా దారి అన్నట్లుగా నడిచే అభిమానులను సంపాదించుకోవడంలో పవన్ సక్సెస్ అయ్యారు.
నేడు ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకం. అంతేకాదు, ఈరోజు పవన్ ఫ్యాన్స్ కు అసలు సిసలైన పండగరోజు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తోంది. ఇటువంటి అభిమానులను సంపాదించుకున్న పవన్ నిజంగా గొప్ప వ్యక్తే.
- పుట్టిన రోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ !
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి