ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్ని పదవుల్లో బీసీలకు అగ్ర ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ పార్టీ నేత విజయసాయి రెడ్డి అంటున్నారు. బీసీ విభాగ అనుబంధ కమిటీలు ఏర్పాటు వేగంగా పూర్తి చేయడం ద్వారా పార్టీ పటిష్టతకు దోహదం చేస్తాయని విజయసాయి రెడ్డి సూచించారు. అలాగే త్వరితగతిన జిల్లాస్థాయి మండల స్థాయి కమిటీలను భర్తీ చేయాలని.. పార్టీ బీసీ విభాగానికి ఉపాధ్యక్షులు నియమించేందుకు పరిశీలిస్తున్నామని విజయసాయి రెడ్డిచెప్పారు.


ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ అడుగడుగునా సామాజిక న్యాయం అమలు చేస్తున్నారన్న విజయ సాయిరెడ్డి.. అన్ని పదవుల్లో బీసీలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాజ్యసభ ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, జడ్పీ చైర్మన్లగా మున్సిపల్ చెర్మెన్లుగా, కార్పొరేషన్ మేయర్లుగా బీసీలను నియమించారని విజయ సాయిరెడ్డి గుర్తు చేశారు. నామినేటెడ్ పదవుల్లోనూ వైయ‌స్ఆర్‌సీపీ  బీసీలకు అధిక  ప్రాధాన్యత ఇస్తుందని విజయ సాయిరెడ్డి వివరించారు.


రాష్ట్రంలోని 139 వెనుకబడిన కులాలకు 56 సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్లను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని విజయ సాయిరెడ్డి చెప్పారు. బీసీ సంఘాలు ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్న బీసీ కుల గణనకు కూడా జ‌గ‌న్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని విజయ సాయిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని.. అందు కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని విజయ సాయిరెడ్డి అన్నారు.


బీసీ జనాభా లెక్కింపును ఈ  కమిటీ అధ్యయనం చేయనుందని విజయ సాయిరెడ్డి తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా జనాభా లేక్కల సేకరణకు బీసీ కులం కాలమ్ చేర్చి కుల గణన చెప్పట్టాలంటూ కేంద్రాన్ని కోరుతూ వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని విజయ సాయిరెడ్డి గుర్తు చేశారు. అందుకే బీసీ నేతలంతా చిత్తశుద్ధితో పనిచేసి వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలుపు కోసం కృషి చేయాలని విజయసాయి రెడ్డి కోరారు. నాలుగేళ్ల కాలంలో బీసీలకు జరిగిన లబ్ధిని బీసీలకు తెలియజేయాలని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: