టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారు.  ఓ పక్క జనసేన బీజేపీతో కలిసుంది. మరో వైపు బీజేపీ తో జనసేన ఇప్పటికీ కలిసే పోటీ చేస్తామని చెబుతోంది. కానీ మధ్యలో టీడీపీతో బీజేపీ కలవకూడదని అనుకుంటుంది. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు చేసిన మోసానికి బీజేపీ నాయకులు అస్సలు ఇష్టపడటం లేదు. ముఖ్యంగా బీజేపీని దోషిగా చూపించి ఆంధ్రలో మరోసారి అధికారంలోకి రావాలని అనుకున్న చంద్రబాబును ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు.


మున్సిపల్, స్థానిక సంస్థలు, ఉప ఎన్నికల్లో కూడా బీజేపీకి మద్దతు ఇవ్వకుండా టీడీపీకే జనసేన మద్దతు ఇచ్చింది. ముఖ్యంగా జనసేన బీజేపీతో పొత్తులో  ఉన్నట్లు చెబతున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో మాత్రం టీడీపీకే సపోర్టు చేయడం నైతికమా అనైతికమా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇదే సమయంలో చంద్రబాబు కూడా జనసేన మద్దతు టీడీపీకి ఉందని ప్రకటించడం కొసమెరుపు.


దీనికి జనసేన నుంచి ఎవరూ కూడా స్పందించలేదు. జనసేన మాత్రం బీజేపీతో కూడా కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా.. అది ఎంతవరకు నిజం అవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా బీజేపీ మాత్రం చంద్రబాబును నమ్మలేని స్థితిలో ఉంది. అధికారంలోకి రాకున్నా పర్లేదు. కానీ చంద్రబాబుతో పొత్తు మాత్రం పెట్టుకోవాలని అనుకోవడం లేదు. అందుకే ఎన్టీఆర్ కుతూరు దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు ఇచ్చి చంద్రబాబును దెబ్బకొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.


బీజేపీ అధిష్టానం పన్నిన ఈ వ్యుహాంలో చంద్రబాబు దెబ్బతింటారా లేదా అనేది రాబోయే ఎన్నికల్లో తేలనుంది. బీజేపీని ఎంత వరకు పురందేశ్వరీ ముందుకు నడిపించగలుగుతుంది. బీజేపీలో సోము వీర్రాజును కాదనుకుని పురందేశ్వరీకి పదవి ఇచ్చారు. మరి ఎన్టీఆర్ ను అభిమానించే కార్యకర్తలు టీడీపీని కాదని బీజేపీకి ఓటు వేస్తారా? ఆ విధమైన ప్లాన్ సక్సెస్ అవుతుందా? బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకోగలుగుతుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: