ఇక యాపిల్స్‌లో 100 గ్రాములకు 50 కేలరీలు అనేవి ఉంటాయి. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. యాపిల్స్‌లో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఇది కరిగే ఫైబర్. బరువు తగ్గడాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఇది బాగా సహాయపడుతుంది. యాపిల్స్‌లోని ఫైబర్ కంటెంట్ మలబద్ధకం సమస్యను నివారించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా అలాగే 100 గ్రాముల బ్రోకలీలో దాదాపు 34 కిలో కేలరీలు అనేవి ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటెంట్ కంటి చూపును బాగా మెరుగుపరుస్తుంది. ఇంకా అలాగే ఎముకలను కూడా ధ్రుడంగా ఉంచుతుంది. ఈ బ్రోకలీలో ఉండే ఫోలిక్ యాసిడ్ ఐరన్ రక్తహీనతను నివారించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఈ బ్రోకలీలో కెంప్ఫెరోల్ అని పిలువబడే ఫ్లేవనాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటాయి.ఇక టమోటాల్లో కేవలం 19 కేలరీలు మాత్రమే ఉంటాయి. టమాట పొటాషియం, విటమిన్ సి , న్యూట్రీషియన్ ఫైబర్  గొప్ప మూలం.


టొమాటోలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయని చాలా అధ్యయనాల ద్వారా నిరూపించబడింది.ఇంకా అంతేకాకుండా, వాటిలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇది UV కిరణాల నుంచి చర్మం దెబ్బతినకుండా సహాయపడుతుంది.అలాగే దోసకాయలో అధిక నీటి కంటెంట్ అనేది ఉంటుంది. ఇవి మన శరీరానికి బాగా అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. దోసకాయ అధిక నీటి కంటెంట్ ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారికి ఇది చాలా మంచి పోషకాహారం. ఇక 100 గ్రాముల దోసకాయలో కేవలం 15 కేలరీలు మాత్రమే ఉంటాయి.ఇవి చాలా మేలు చేస్తాయి.100 గ్రాముల క్యారెట్‌లో దాదాపు 41 కేలరీలు ఉంటాయి. కొలెస్ట్రాల్ ఇంకా సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి, మీరు రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే  క్యారేట్లు చాలా ప్రయోజరకరంగా ఉంటాయి. క్యారెట్‌లు డైటరీ ఫైబర్‌కి చాలా మంచి మూలం. వీటిలో పొటాషియం, మాంగనీస్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: