
ఇప్పుడు చూద్దాం ఎండకాలంలో ముఖాన్ని అందంగా మార్చే కొన్ని ఇంటి చిట్కాలు, ప్యాకులు మరియు వాటి ప్రయోజనాలు.పెసరపప్పు – పసుపు ప్యాక్,పెసరపప్పు పొడి – 2 టీస్పూన్లు, పసుపు – చిటికెడు,రోజ్ వాటర్ – అవసరమైనంత, ఈ మూడింటిని కలిపి సున్నితమైన పేస్ట్ లా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కడగాలి. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. మురికి తొలగుతుంది.బ్రణాలు తగ్గుతాయి. చందనం పొడి – 1 టీస్పూన్,తేనె – 1 టీస్పూన్, పాలు – 1 టీస్పూన్, అన్నిటిని కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. సన్ టాన్ తగ్గుతుంది.
ముఖం మృదువుగా మారుతుంది. నలుపు మచ్చలు తొలగుతాయి. టమాట – చక్కెర స్క్రబ్, పచ్చ టమాట – 1, చక్కెర – 1 టీస్పూన్, టమాట ముక్కలో చక్కెర చల్లి ముఖం మీద సున్నితంగా రుద్దాలి. 5 నిమిషాల తర్వాత కడగాలి. డెడ్ స్కిన్ తొలగుతుంది. స్కిన్ బ్రైట్ గా కనిపిస్తుంది. ఆయిలీ స్కిన్ తగ్గుతుంది. అలవేరా – నిమ్మరసం ప్యాక్, అలవేరా జెల్ – 2 టీస్పూన్లు,నిమ్మరసం – ½ టీస్పూన్, తేనె – 1 టీస్పూన్, వీటిని బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత కడగాలి. మళ్లీ ముఖానికి తేమ వస్తుంది. చర్మం పగుళ్ల సమస్య తగ్గుతుంది. ప్రాకృతికంగా ముఖం మెరుస్తుంది.