
మిమ్మల్ని అంటారు . అందుకే అవసరం ఉన్న విషయాలలో మాత్రమే కలగజేసుకోవాలి . కొందరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు . కానీ ఈ ఆలోచన నుంచి మనసుకు విశ్రాంతి చాలా ముఖ్యం . అందుకే మీ మనసుకు కాసేపు విశ్రాంతిని ఇవ్వండి . దానికోసం జ్ఞానం చేయడం చాలా బెటర్ . భాగస్వామి విషయంలో కొన్నిసార్లు గొడవలు పడుతూ ఉంటారు . తరచూ లేనిపోని కారణాలకు ఇలా గొడవలు జరుగుతుంటే సమస్య ఏంటో తెలుసుకోలేరు . ఈ గొడవలకు కూడా ఓ హద్దు పెట్టుకోవాలి . కొంతమంది తమకు ఇష్టం లేకపోయినా మొహమాటానికి ఇతరుల కోసం తమ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు . ఇలా చేస్తే మీకే నష్టం . అందువలన మీ సమయం వృధా అవుతుంది అనుకుంటే వారికి నిర్మోహమాటంగా నో అని చెప్పండి .
మీ స్నేహాలు మరియు భాగస్వామి అదే విధంగా ఫ్యామిలీ మెంబర్స్ మీకు చాలా విషయాల్లో సహాయాలు చేస్తూ ఉంటారు . కానీ మీ నిర్ణయమే ఫైనల్ అనేలా ప్రవర్తిస్తూ ఉంటారు . ఇతరుల ఆలోచనలు మీ మీద ప్రభావం చూపించకుండా చూసుకోవాలి . మీ స్నేహితులలో మరియు ఫ్యామిలీ మెంబర్స్ అదేవిధంగా బంధువులలో కొంతమంది మిమ్మల్ని ఇతరుల ముందు వెక్కిరించడం మరియు చులకన చేయడం వంటివి చేస్తారు . ఇది మంచిది కాదని తగిన బుద్ధి చెప్పండి . ఈ విషయంలో అస్సలు సున్నితంగా ఉండకూడదు . కొంతమంది పని రాక్షసులు అనే చూపించుకోవడానికి ఇష్టపడతారు . కానీ ఇలా విశ్రాంతి లేకుండా పని చేస్తే అనేక సమస్యలు వెంటాడతాయి . మీ పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది . అందువలన పనికి కూడా ఓ హద్దు పెట్టుకోవాలి . లేదంటే మీ లైఫ్ డ్యామేజ్ అవుతుంది . ఈ విషయాలలో హద్దులు పెట్టుకోకపోతే మీ లైఫ్ డేంజర్ జోన్ లో పడినట్లే .