ఈ బుధవారం రిలీజైన సైరా నరసింహారెడ్డి సినిమాకి వరల్డ్ వైడ్ గా పాజిటివ్ టాక్ వస్తుందనుకుంటే అది రివర్స్ అయి తెలుగులోనే  పాజిటివ్ టాక్ వచ్చి మిగతా అన్నీ చోట్లా నెగిటివ్ టాక్ వచ్చింది. ఎంతో నమ్మకంగా బాలీవుడ్ లో బాహుబలి లా హిట్ జోనర్ లోకి వెళుతుందనుకుంటుంటే అందరి అంచనాలను తారుమారు చేస్తు తేడా కొట్టింది. 4 భాషల్లో సైరా కి నెగిటివ్ గానే టాక్ వచ్చింది. ఇక సైరాతో పోటిగా రిలీజైన బాలీవుడ్ సినిమా వార్ అక్కడ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. హృతిక్ రోషన్ నుండి చాన్నాళ్ళకి మాంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ రావడంతో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే బాలీవుడ్ లో వార్ ను తట్టుకోలేకపోయింది సైరా. అక్కడ జనాలు సైరాను పట్టించుకోవడం లేదని తాజా సమాచారం. 

ఇక వాస్తవంగా చూస్తుంటే బుధవారం విడుదలైన భారీ చిత్రం సైరా కు బాలీవుడ్ లో వస్తున్న వసూళ్లు చూసి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ అయోమయంలో పడిపోయారు. అక్కడ ఈ సినిమాకి సాహో సినిమాకంటే మంచి రివ్యూలు కూడా వచ్చాయి. అయినా అక్కడ వార్ సినిమాతో పోటీగా రిలీజ్ చేయడంతో సైరా కి ఒక మోస్తరు కలెక్షన్స్ కూడా రావట్లేదు. బాహుబలి రేంజ్ లో ఈ సినిమా తీసినా హిందీ ఆడియన్స్ ఎందుకు పక్కన పెట్టారో తెలియట్లేదని సైరా యూనిట్ అనుకుంటున్నారట.

ఈ సినిమా హిందీ వెర్షన్ లో మొదటిరోజు కేవలం 2.5 కోట్లు నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. రెండవ రోజు అయితే ఈ కలెక్షన్స్ కోటి రూపాయల లోపే ఉన్నాయి. అయితే ఈ రెండు రోజులు వీకెండ్ కావడంతో ఈ రెండు రోజుల కలెక్షన్స్ మీద సినిమా యూనిట్ చాలా ఆశలు పెట్టుకుందట. అమితాబ్, తమన్నా లాంటి బాలీవుడ్ జనానికి పరిచయం ఉన్నప్పటికి బాలీవుడ్ జనాలు మాత్రం ఈ సినిమాని పట్టించుకోవట్లేదు. ఏదేమైనా హిందీ వెర్షన్ లో సైరా భారీ డిజాస్టర్ గా నిలిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే గనక జరిగితే ఇక మన టాలీవుడ్ నుండి ఇలాంటి భారీ సినిమాలను బాలీవుడ్ కి తీసుకెళ్ళే అవకాశాలు తగ్గుతాయనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: