సతీష్ వేగేశ్న నిర్మాతగా విజయ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన చిత్రం 'నాంది'.అల్లరి నరేష్ కెరీర్లో 57వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకను ఫిబ్రవరి 15న చిత్రయూనిట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు శరత్ కుమార్, రాధిక, సునీల్, దర్శకులు హరీష్ శంకర్, ప్రశాంత్ వర్మ, సతీష్ వేగేశ్న తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 'నాంది' ఫస్ట్ టికెట్‌ను శరత్ కుమార్, రాధిక కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ
 'ఇది నా సినిమా ఫంక్షన్‌లా ఉంది. నాకు ఇవివిగారంటే చాలా అభిమానం. ప్రతీ సినిమాకి ఆయన దగ్గర ఎప్పుడూ ఒక పదిమంది రైటర్స్ వర్క్ చేస్తుంటారు.
 
అలా నేను కూడా ఆ పది మందిలో ఒక రైటర్‌ని అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. ఆయనే నాకు స్పూర్తి. నరేష్ కూడా ఎంతో మంది కొత్తదర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నాందితో మా విజయ్‌ని డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా నరేష్‌కి థాంక్స్ చెబుతున్నాను. విజయ్ కల, కష్టం రెండూ ఈ చిత్రంతో నెరవేరాయి. విజయ్ నా దగ్గర 5 సినిమాలకు వర్క్ చేశాడు. విజయ్ సెట్లో ఉంటే నాకు ఒక ధైర్యం, ధీమా ఉంటుంది. నా ఎన్నో విజయాల వెనుక విజయ్ కాంట్రిబ్యూషన్ ఉంది. తనని చూసి అందరూ హార్డ్ వర్క్ నేర్చుకోవాలి. ఒక డిఫరెంట్ సినిమా టీజర్‌తోనే అందర్నీ ఆకట్టుకున్నాడు. నాంది టీజర్ చూసి షాక్ అయిపోయాను.

 జనరల్‌గా నా నుంచి వస్తున్నాడంటే ఎంటర్టైన్మెంట్ సినిమా తీశాడేమో అనుకున్నా.. అలా కాకుండా డిఫరెంట్ జోనర్స్ లో నాంది చిత్రాన్ని అద్భుతంగా తీశాడు.మహర్షిలో మా వంశీ అల్లరి నరేష్‌ని ఒక కొత్త యాంగిల్ లో చూపించాడు. అప్పటి నుంచి అల్లరి నరేష్ అని పిలవటం మానేసి యాక్టర్ నరేష్ అని పిలుస్తున్నారు. ఈ చిత్రంలో నెక్ట్స్‌ లెవెల్‌లో విజయ్.. నరేష్‌ని చూపించాడు. ఇప్పటివరకూ ఒక 56 సినిమాలు చేసి నవ్విస్తూ.. నవ్విస్తూ సడన్‌గా ఏడిపించడం చాలా కష్టం. ఈ సినిమా ఒప్పుకొని చేసినందుకు నరేష్ గట్స్ కి హ్యాట్సాప్..అంటూ చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్..!!


మరింత సమాచారం తెలుసుకోండి: