శర్వానంద్ లో చాలమంచి నటుడు ఉన్నాడని అందరికి  తెలుసు. ఆయన మొదట్లో హిట్స్ లేకపోయినా కూడా రన్ రాజా రన్ సినిమా తర్వాత శర్వానంద్ కెరీర్ మారిపోయింది . ఆ సినిమా తర్వాత వరస హిట్స్ తో  శర్వానంద్ దూసుకెళ్లాడు. ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి ,మహానుభావుడు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ట అవ్వడంతో ఇక శర్వానంద్ కి తిరుగులేదు అనుకున్న టైంలో వరుసగా 3 ప్లాప్స్ వచ్చేయ్.  అందులో పడి పడి లేచే మనసు, భారీ అంచనాలతో వచ్చిన రణరంగం, ఇంకా సమంత కలిసి నటించిన జాను సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు 96 సినిమా  శర్వానంద్ రీమేక్ చేశారు.ఈ సినిమా విడుదలకు ముందు మంచి బజ్ వినిపించిన కూడా ఈ సినిమా స్లో గా ఉండడంతో ఆడియన్స్ సినిమా తిప్పికొట్టారు. అయితే ఇప్పుడు శర్వానంద్  మహాసముద్రం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని ఆర్ఎక్స్ 100 మూవీ దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ లో శర్వా చాలా మాస్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటిదాకా శర్వానంద్ ని ఫుల్ మాస్ రోల్ లో వచ్చిన సినిమా లేదు. ఈ సినిమా ఆ లోటుని తీర్చేలాగానే ఉంది. ఈ మహా సముద్రం సినిమాలో శర్వాతో పాటు సిధార్థ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.శర్వానంద్ ఈ సినిమా మీద తన ఆశలు పెట్టుకున్నాడు .ఇక ఆయాన నటిస్తున్న ఇంకో చిత్రం శ్రీకారం సినిమా మార్చి లో విడుదల కాబోతుంది ఈ సినిమా ఎంత రేంజ్ లో హిట్ అవుతుందో విడుదల వరుకు వేచి చూడాలి. ఈ సినిమాలో శర్వానంద్ ఒక రైతుగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక కనిపించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: