అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ ఈ పేరు తెలుగు ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికే విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ లో సువర్ణ పాత్రతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నాని హీరోగా తెరకెక్కిన టక్ జగదీష్ నటించి మెప్పించింది, ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ చేసింది చిన్న పాత్రే అయినా ఈ ముద్దుగుమ్మ తన నటనతో ఎంతో మంది ప్రజలను ఆకట్టుకుంది. తమిళ్ సినిమాల్లో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ గా కొనసాగుతున్న ఐశ్వర్య రాజేష్ తెలుగులోనూ తన క్రేజ్ ను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది, అందులో భాగంగా ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది, ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయబోతున్నారు, ఇది ఇలా ఉంటే ఈ సినిమా తేదీ దగ్గర పడటంతో రిపబ్లిక్ చిత్ర హీరోయిన్ అయిన ఐశ్వర్య రాజేష్ పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంటూ హల్చల్ చేస్తున్నారు.

 తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది, ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ కు మీ రోల్ మోడల్ ఎవరు అనే ప్రశ్న ఎదురైంది, అందుకు ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ. అంతకు ముందు నేను సౌందర్య గారి అభిమానిని, ఎలాంటి పాత్రలోనైనా ఆమె అందంగా ఇమిడిపోయే తీరు నాకు చాలా బాగా నచ్చేది, అప్పట్లో ఆమె సినిమాలు నేను తప్పకుండా చూసేదానిని, ఎంతో సింపుల్ గా ఉండే పాత్రలో నైనా అంత అందంగా కనిపించే వారిని నేను చూడలేదు. ఇక ఇప్పటి హీరోయిన్లలో నాకు సమంత అంటే చాలా ఇష్టం, సమంతనే నారోల్ మోడల్ అంటూ ఐశ్వర్య రాజేష్ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: