సంక్రాంతి అంటే కోడి పందాలు,ముగ్గుల సంద‌ళ్లు, అమ్మాయిల ప‌రికిణీ ఓణీల రంగు రంగుల ముచ్చ‌ట్లు, ఇంకా ఎన్నో వినిపిస్తాయి. కానీ ఇప్పుడు ఆ పండ‌గ వాతావ‌ర‌ణానికి తోడు కరోనా భ‌యాలు వెన్నాడుతున్నాయి.పెద్ద సినిమాలేవీ థియేట‌ర్ల ద‌గ్గ‌రకు రాలేదు. కనీసం అప్డేట్ లు కూడా పెద్ద‌గా ఏమీ లేవు.ఇలాంటి నిరాశ‌మ‌య త‌రుణంలో బంగార్రాజు వ‌చ్చినా కూడా ఆ సినిమా పై ఉన్న అంచ‌నాలు క‌న్నా మిగ‌తా సినిమాల‌పై ఉన్న అంచనాలే ఎక్కువ క‌నుక అభిమానులు కాస్త కాదు చాలా నిరాశ‌లో ఉండిపోయారు.మెగాభిమానులు ఈ సంక్రాంతికి త‌మ హీరో వ‌స్తాడ‌ని అనుకున్నా అవేవీ కుదిరేలా లేవు అని తేలిపోయింది.


సంక్రాంతికి కాక‌పోయినా ఆర్ఆర్ఆర్ రిలీజ్ మారిపోయింది క‌నుక ద‌గ్గ‌ర్లో ఉన్న తారీఖుల్లో అయినా సినిమా విడుద‌ల అవుతుందన్న ఆశ‌తో  ఉన్న వారికి మెగాస్టార్ ఝ‌ల‌క్ ఇచ్చారు.త‌ప్పనిసరై త‌మ సినిమా విడుద‌ల‌ను వాయిదా వేసుకుంటున్నామ‌ని ఆయ‌న చెప్పినా కూడా సంబంధిత అభిమాన వ‌ర్గాల్లో పండ‌గ చేసుకున్నట్లే లేదు.వీరంతా అన్న‌య్య రాక కోసం ఎదురుచూసిన వారే! గ‌తంలో సంక్రాంతికి ఇప్పుడు సంక్రాంతికి త‌లుచుకుని వీరంతా బాధ‌ప‌డుతున్నారు.ఇదే స‌మ‌యంలో  చిరు ఇప్ప‌టికి కూడా ఆచార్య‌పై క్లారిఫికేష‌న్ ఇవ్వ‌లేదు.ప‌రిస్ధితులు అనుగుణంగా ఉంటే అప్పుడు మాత్ర‌మే సినిమా విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తామ‌ని మాత్రం అంటున్నారు సామాజిక మాధ్య‌మాల్లో!
 


మెగాస్టార్ చిరంజీవిసంక్రాంతి బ‌రిలో లేరు.వేస‌వికి వినోదాలు అందించేందుకు సిద్ధం అవుతున్నారు.అప్ప‌టికి త‌న సినిమా ఆచార్య‌ను విడుద‌ల‌చేస్తాన‌ని ఇవాళ కాస్త గంద‌ర‌గోళంతో కూడిన విధంగానే నెటిజ‌న్ల‌కు ఓ లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు.మార్చి చివ‌రిలో కానీ ఏప్రిల్ మొద‌టి వారంలో కానీ ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నామ‌ని ప్ర‌క‌టించారు సామాజిక మాధ్య‌మాల్లో! రాష్ట్రంలోనూ,దేశంలోనూ నెల‌కొన్న విప‌త్క‌ర ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆచార్య విడుద‌ల‌ను వాయిదా వేసుకున్నామ‌ని చెప్పారాయ‌న. ఇదిలా ఉంటే మ‌రోవైపు వేస‌వి కానుక‌గా వ‌చ్చే సినిమాల్లో ఆచార్య రాక ఫిక్స్ అయితే ఇక ఆర్ఆర్ఆర్, స‌ర్కారు వారి పాట, భీమ్లా నాయ‌క్ త‌దిత‌ర పెద్ద సినిమా సంగ‌తేంటి? అన్న ప్ర‌శ్న ఒక‌టి సినీ ప్రేమికుల‌ను వెన్నాడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: